Isis took tripoli hotel taken into hostage

Libya, Tripoli hotel, 5 masked gunmen, hostage, Libya's Corinthian Hotel, hostage crisis in Libya, 5 man stormed with bulletproof vests, car bomb blast in Tripoli, Tripoli's old city hotel, Corinthian hotel filled with foreigners, Corinthian Hotel popular with foreigners, Libya fight over oil supremacy,

In another developing hostage crisis, unidentified gunmen donning bulletproof vests barged into Libya's Corinthian Hotel and opened fire, taking people hostage.

ట్రిపోలీ హోటల్ నిర్భంధంలోకి తీసుకున్న ఐఎస్ ఉగ్రవాదులు

Posted: 01/27/2015 05:32 PM IST
Isis took tripoli hotel taken into hostage

దక్షిణాప్రికాలోని చమురు ఉత్పత్తి దేశాలలో అగ్రభాగాన నిలిచిన లిబియాలో మళ్లీ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. లిబియా చమురుపై అధిపత్యం కోసం పోరాడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లిబియా రాజధాని ట్రిపోలిలో విధ్వంస రచనకు తెగబడ్డారు. అక్కడున్న ప్రముఖ హోటల్ లోకి చోరబడి అందులోని అతిధులను బంధీలుగా తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భారత్ కాలమాన ప్రకారం ఇవాళ రెండున్నర గంటల ప్రాంతంలో లిబియా రాజధాని నగరం ట్రిపోలిలోని పాత నగరంలోని ప్రముఖ కొరింత్యా హోటల్ వద్ద ఉగ్రవాదులు కారు బాంబును పేల్చారు.

ఆ తరువాత వెంటనే సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు హోటల్ లోకి ప్రేవేశించారు. వారి రాకను అడ్డుకోబోయిన ముగ్గురు గార్డులను కాల్చి చంపి హోటల్ లోకి ప్రవేశించారు. సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు బులెట్ ఫ్రూఫ్ జాకెట్లను ధరించి, గాలిలోకి కాల్పులు జరుపుతూ.. హోటల్ లోని అతిధిలను బంధీలుగా చేసుకున్నారు. అయితే హోటల్ వర్గాల సమాచారం ప్రకారం హోటల్ లో సుమారు 90 శాతం గదులు ఖాళీగా వున్నాయని సమాచారం. కానీ కొంత మంది వ్యాపార్థస్థులు, దౌత్యవేత్తలు మాత్రం ఉన్నారని చెప్పారు. కాగా ఉగ్రవాదులు ఎంత మంది ఏ ఏ దేశం వారిని బందీలుగా తీసుకున్నారన్న వివరాలు తెలియాల్సి వుంది.

ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. 1998లో అమెరికా రాయబారిపై బాంబుదాడులకు యత్నించిన కేసులో నేరస్థుడిగా నిర్ధారణ అయిన అనాస్ అల్ లిబి అనే లిబియాకు చెందిన నేరస్థుడు ఇటీవల ట్రయల్ కొనసాగుతుండగానే మరణించాడు. అతని మరణానికి ప్రతికార చర్యగానే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఈ దాడులకు తెగబడినట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతుంది. ఈ బాంబు దాడులలో వందలాది మంది టాంజానియా, కెన్యా వాసులు మరణించారు. కాగా ఈ దాడులకు తెగబడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తేల్చిచెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : libya  tripoli  hostage  corenthia hotel  5 gun men  

Other Articles