Pakistan border soldiers says thanks to indian soldiers

india pakistan border, indian border soldiers, pakistan border soldiers, republic day functions, india pakistan border republic day festivals

pakistan border soldiers says thanks to indian soldiers : pakistan border soldiers says thanks to indian soldiers for giving them sweets on rupublic day occassion.

భారత్ ‘తియ్యని’ ప్రేమకు తలొగ్గిన పాక్ దళాలు..

Posted: 01/26/2015 06:07 PM IST
Pakistan border soldiers says thanks to indian soldiers

భారత్ - పాకిస్తాన్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గమనే శత్రుత్వం వుందని ప్రతిఒక్కరు చెప్పుకుంటూ వుంటారు. ఆ దేశ సైనికదళాలతోపాటు ప్రధానమంత్రులు సైతం ఎడమొహం - పెడమొహం పెట్టుకుంటూ తిరుగుతుంటారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో అయితే పాకిస్తాన్ ఎప్పుడూ దారుణాలకే ఒడిగడుతూ వుంటుంది. అమాయక ప్రజలను లెక్కచేయకుండా తమ పైశాచికత్వాన్ని చూపిస్తుంటుంది. కానీ చాలాకాలం తర్వాత భారత్’పై పాక్’కు ప్రేమ చిగురించినట్లుంది. అందుకే.. భారత్ చూపిన ఆప్యాయతకు వాళ్లు తలొగ్గారు.

ఇది వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. జరిగింది మాత్రం నిజమే! భారత్ చూపించిన ఆప్యాయత పట్ల చలించిపోయిన పాక్ దళాలు తలొగ్గాయి. తమవైపు నిత్యం ఎన్ని ఉల్లంఘనలు జరిగినప్పటికీ భారత్ తమతో ప్రేమగా వ్యవహరించడాన్ని చూసి పాక్ దళాలు సంతోషం వ్యక్తం చేశాయి. అంతేకాదు.. తమ సంతోషాన్ని భారత్ సైనిక దళాలతో వాళ్లు కాసేపు పంచుకున్నారని సమాచారం! ఎన్నడూలేని విధంగా ఈసారి ఈ రెండు దేశాల సైనిక దళాల మధ్య ఈవిధంగా స్నేహబంధం కుదరడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ ఈ వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే నియంత్రణ రేఖ వద్ద వున్న కమాన్ పోస్టు, తీత్వాల్ ప్రాంతాల్లో భారత సైనికులు సరిహద్దుకు అవతలివైపు వున్న పాక్ బలగాలకు మిఠాయిలు పంచారు. ఈవిధంగా భారత్ సైనికులు చూపించిన చొరవకు పాక్ దళాలు సంతోషం వ్యక్తం చేశాయి. తమవైపు నుంచి నిత్యం చొరబాట్లు, ఉల్లంఘనలు, పోరాటాలు వున్నా.. భారత దళాలు తమకు ప్రేమతో స్వీట్లు పంచడంపై కృతజ్ఞతలు తెలిపాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india pakistan border  republic day festivals  

Other Articles