200 child labourers rescued in hyderabad

Child labour, Hyderabad child labour, Hyderabad police, Hyderabad police rescue child labour, bangle making shops, footwear workshops, Hyderabad Old City,

Around 200 children employed at bangle-making and footwear workshops in Aman Nagar area in the Old City were rescued early on Saturday by the city police.

పాతబస్తీ.. జబర్దస్తీ.. గజ దొంగల మస్తీ..

Posted: 01/24/2015 01:44 PM IST
200 child labourers rescued in hyderabad

చారిత్రక నేపథ్యమున్న పాతబస్తీ.. చార్ మినార్, గొల్కోండ సహా అన్ని చూడదగ్గ ప్రాంతాలే. ఇప్పటికీ హైదరాబాద్ బిర్యాని, చార్మినార్ గాజులు, దుస్తులు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ్యత సంతరించుకున్నవే. అలాంటి నేపథ్యమున్న ప్రాంతంలోనే కొందరు మనుషులు మాత్రం మానవత్వానికి తిలోదకాలు ఇచ్చేశారు. అభం శుభం తెలియని చిన్నారులతో పాతబస్తీకి చెందిన పలువురు చిన్న పరిశ్రమల యాజమానులు జబర్దస్తీగా పనిచేయిస్తున్నారు. నగరంలో తనిఖీలు చే్స్తుండంగా పోలీసులు చేతికి బాల కార్మికుల శ్రమను దోచుకుంటున్న ఘరాణ గజదోంగలే దోరికారు.

పాతబస్తీలోని అమన్ నగర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 200 మంది బాలకార్మికులు వెట్టిచాకిరిలో మగ్గడాన్ని గమనించారు. వారందరినీ చేరదీశారు. వారి వివరాలను కనుగోన్నారు. వారికి వెట్టి చాకిరి నుంచి విముక్తుల్ని చేశారు. చారిత్రాత్మక హైదరాబాద్ ఖ్యాతికి భంగం వాటిల్లేలా వున్నాయి. స్వతంత్ర భారత దేశంలో బాలకార్మికులకు చేత పనులు చేయించరాదని.. కార్మిక శాఖ ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా..  అధికారులు నామమాత్రపు చర్యతో యధశ్ఛగా వెట్టిచాకిరి నడుస్తోంది. బీహార్, తదితర వెనుకబడిన ప్రాంతాలనుంచి బాలకార్మికులను తీసుకువచ్చి వారిని గాజులు, చెప్పుల పరిశ్రమల్లో కార్మికులుగా చేర్చుకుంటున్నారు. బాలల తల్లిదండ్రులకు ఎంతో కొంత డబ్బును ముట్టజెప్పి వారిని వెట్టి చేయించుకునేందుకు తీసుకువస్తున్నారు.

పోలీసుల తనిఖీలతో బంధవిముక్తులైన బాలకార్మికుల్లో నాలుగేళ్ల చిన్నారుల నుంచి 12 ఏళ్ల బాలుడు వరకు వున్నారు. పరిశ్రమల్లో వీరు 14 గంటల వరకు పనులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు పరిశ్రమలలో వాడే ప్రమాదకర రసయనాలతో వీరు పనిచేయడం వల్ల రోజు బాలల ఆరోగ్యంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. పనివేళల తరువాత బాలలను ఉంచే గదికి సిసి కెమెరాను ఏర్పాటు చేసిన యజమానులు.. వారికి చలికి తట్టుకునేలా దుప్పట్లను కూడా పొందుపర్చలేదు. ఒక గదిలో సుమారు 30 మంది పిల్లలను పెట్టి యజమానులు నిరంకుశంగా వ్యవహరించారు.

మరోవైపు బాలకార్మికుల విషయంపై సమాచారం అందుకున్న కార్మిక శాఖ గతంలో తనిఖీలు నిర్వహించి సుమారు 70 మందిని బంధవిముక్తుల్ని చేసింది. అయినా మళ్లీ అదే తంతు జరుగుతుంది. బ్రోకర్లకు , పరిశ్రమల యజమానులకు మధ్య మంచి నెట్ వర్క్ వుండటం కారణంగానే ఇలాంటి సంఘటనలను పునరావృతం అవుతున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాలకార్మికులను స్థానికంగా గల ఫంక్షన్ హాలుకు తరలించి వారిని నుంచి వారి తల్లిదండ్రుల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇవాళ సాయంత్రం బాలలను వారి స్వస్థలాకు పంపేందుకు అధికారులు చర్యలను చేపట్టినట్లు సమాచారం. అయితే పోలీసులు తనిఖీలలో భాగంగా లభించిన పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పలువురు రౌడీ షీటర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Child labour  Hyderabad child labours rescue  Hyderabad Police  

Other Articles