Airtel network stops ringing

airtel network, technical interruption, airtel mobiles silent, no ringing tones, airtel mobiles not working in hyderabad, technical interruption in airtel network, hyderabad airtel network, hyderabad airtel network interrupts, technical interruption surfaces airtel

technical interruption in airtel network stops ringing in hyderabad

ఎయిర్ టెల్ ఫోన్లు మూగబోయిన వేళ..

Posted: 01/24/2015 11:47 AM IST
Airtel network stops ringing

ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం ఎయిర్టెల్ నెట్వర్క్కు శనివారం ఉదయం అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో పలు ప్రాంతాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో ఎయిర్ టెల్ నెట్ వర్క్ వినియోగదారులు సమస్యను ఎదుర్కోంటున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎయిర్టెల్ నెట్ వర్క్ పనిచేయటం లేదని ఎయిర్ టెల్ వినియోగదారులు చెబుతున్నారు. తమ ఫోన్లలో లోపముందేమోనన్న సందేహంతో కొంత సేపు మౌనంగా వున్నా.. అదే ఫోన్లోని మరో నెట్ వర్క్ బాగానే పనిచేస్తుండడంతో ఎయిల్ టెల్ నెట్ వర్క్ సమస్య అని తెలుసుకున్నారు.

దీంతో వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎయిర్ టెల్ సర్వర్ల సమస్యా లేక సాంకేతిక సమస్య అన్నది కస్టమర్ కేర్ సభ్యులు కూడా చెప్పలేక పోతున్నారు. ఉదయం నుంచి ఏకబిగిన కస్టమర్ కేర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎందుకిలా జరిగిందో కూడా తెలియని సిబ్బంది ఫోన్ కాల్స్ కు ప్రతిస్పందించడంలేదు. దీంతో ఎయిర్ టెల్ వినియోగాదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నెట్ వర్క్ నిర్వహణా అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నెట్వర్క్ పునరుద్దరణకు మరో గంట సమయం పడుతుందని తెలుపుతున్నా.. నిజానికి సమస్య ఎక్కడ వుంది. పునురద్దరణకు ఎంత సమయం పడుతుందన్నది కూడా అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో వినియోగదారులు మండిపడుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : airtel network  interrupton  Hyderabad  

Other Articles