Sit police issues notice to shashi tharoor in sunanda death case

Shashi Tharoor, Shashi Tharoor in Sunanda death case, Delhi police notice to Shashi Tharoor, Shashi Tharoor latest, Sunanda Pushkar, Sunanda Pushkar death case, Shashi Tharoor in Sunanda death case, Delhi police in Sunanda Pushkar death case

Delhi police issues notice to Shashi Tharoor in Sunanda Death case : Delhi police given notice to shashi tharoor for questioning him in Sunanda Pushkar Death case. Under section 160 of CrPC tharoor will be questioned by Delhi Police

థరూర్ కు టైం దగ్గరపడుతోంది

Posted: 01/19/2015 01:05 PM IST
Sit police issues notice to shashi tharoor in sunanda death case

సునంద పుష్కర్ హత్య కేసులో పోలిసుల విచారణ వేగవంతం అయింది. కేసును ధర్యాప్తు చేస్తున్ సిట్ అధికారులు కేసులో అనుమానితులు, నిందితులు ఇతర వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చాలామందిని విచారించిన పోలిసులు త్వరలోనే శశి థరూర్ ను ప్రశ్నించనున్నారు. ఇందుకోసం థరూర్ కు నోటిసు కూడా ఇచ్చారు. సీఆర్ పీసీ 160 ప్రకారం థరూర్ ను విచారించేందుకు నోటిసు ఇచ్చినట్లు ఢిల్లీ పోలిస్ కమిషనర్ బీ.ఎస్.బస్సీ తెలిపారు. త్వరలోనే ఆయన్ను విచారిస్తామని చెప్పారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని కమిషనర్ వెల్లడించారు.

శశి థరూర్ కు హత్యతో సంబంధం లేకపోయినా.. ఎవరు హత్య చేశారో మాత్రం తెలుసని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సహా ఇతరులు ఆరోపిస్తున్నారు. సునంద హత్యతో పాటు ఐపీఎల్ వ్యవహారాలపై థరూర్ నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అటు తనకు ఈ హత్యతో సంబంధం లేదనీ.., భార్య మృతికి కారణాలు తెలియాలని తాను కూడా కోరుకుంటున్నట్లు థరూర్ చెప్తూ వస్తన్నారు. ఈ క్రమంలో త్వరలో జరిగే విచారణలో ఈయన ఏం చెప్తారో అని ఆసక్తి నెలకొంది.

గతేడాది జనవరి 17 ఢిల్లీలోని లీలా హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోగా.., ఏడాది తర్వాత ఈ సంవత్సరం జనవరి 1న పోలిసులు హత్య కేసు నమోదు చేశారు. ఆమెపై విష ప్రయోగం జరిగిందని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేస్తోంది. దీంతో ఈ కేసు విచారణ కోసం కమిషనర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటివరకు చాలామందిని విచారించింది. సంచలనంగా మారిన ఈ హత్య కేసులో థరూర్ నోరు విప్పితే కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashi Tharoor  Sunanda Pushkar death  Delhi police  

Other Articles