Ap pcc chief raghuveera reddy fires chandrababu naidu tdp party

ap pcc chief raghuveera reddy, raghuveera reddy news, chandrababu naidu news, chandrababu naidu padayatra, chandrababu naidu comments, tdp party ministers, tdp party leaders

ap pcc chief raghuveera reddy fires chandrababu naidu tdp party : ap pcc chief raghuveera reddy said that if senior ntr is alive then he will beat all tdp party ministers.

ఎన్టీఆర్ బతికుంటే.. టీడీపీ నేతలను పరుగెత్తించి కొట్టేవారు!

Posted: 01/18/2015 04:18 PM IST
Ap pcc chief raghuveera reddy fires chandrababu naidu tdp party

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రానురాను వేడెక్కుతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్నటివరకు వైకాపా, టీడీపీ పార్టీలు ఒకర్నొకరు దూషించుకోగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం వీరి మధ్యలో చేరిపోయినట్లు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఓటమిని చవిచూడటంతో ఆంధ్రాలో కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవడంతో నిన్నటివరకు కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ తన బలాన్ని పుంజుకోవడం కోసం బరిలోకి దిగినట్లు కనిపిస్తోంది.

ప్రముఖ సినీనటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి 19వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నందమూరి కుటుంబసభ్యులతోపాటు టీడీపీ పార్టీ నేతలు, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సమాధికి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో బాబుతోపాటు మరికొంతమంది నేతలు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కొన్ని హామీలు ప్రకటించారు. అనంతరం బాబు తన పాదయాత్రలో బిజీగా వుండిపోయారు. తన పాదయాత్రలో సందర్భంగా ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.

అయితే.. టీడీపీ పార్టీలు కేవలం జనాలను ఆకర్షించడం కోసమే ఇలాంటి పనులు చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ.. ఇంకా ప్రారంభించని పథకాలకు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టి, ఆ మహానుభావుడి పేరును అప్రతిష్టపాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ పార్టీ సిగ్గులేకుండా ఆయన పేరును అడ్డం పెట్టుకుని ప్రజలకు ఆకర్షిస్తోందని దుయ్యబట్టారు. ఎన్టీఆరే గనుకు ఇప్పటికీ బతికుంటే.. ప్రస్తుతం టీడీపీ అనుసరిస్తున్న విధానాలను ఆ పార్టీ నేతలను పరుగెత్తించి మరీ కొట్టేవారని వ్యాఖ్యానించారు. మరి.. దీనిపై టీడీపీ నేతలు ఏ విధంగా తమ వ్యాఖ్యానాలు సంధిస్తారో..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap pcc chief raghuveera reddy  chandrababu naidu padayatra  

Other Articles