Petrol price cut by rs 2 42 per litre diesel rs 2 25 per litre excise duty hiked

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

The government hiked excise duty on petrol and diesel by Rs 2 per litre each to take away gains coming by way of global oil prices dipping to six-year lows.

తగ్గిన ఇంధన ధరలు.. పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ..

Posted: 01/16/2015 08:56 PM IST
Petrol price cut by rs 2 42 per litre diesel rs 2 25 per litre excise duty hiked

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో ఇంధన ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పతనం కోనసాగనుండటంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఇంధన ధరలను తగ్గించాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2.42 చొప్పున, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.25 చొప్పున ధరలను తగ్గించాయి. తగ్గిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు ఆగష్టు నుంచి వరుసగా 10 సార్లు తగ్గాయి. అక్టోబర్ నుంచి 5 సార్లు డీజిల్ ధరలు తగ్గాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ. 65 దిగువన, లీటర్ ధర డీజిల్ రూ. 53 దిగువకు రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ కు 46 డాలర్ల కంటే దిగువ స్థాయికి పడిపోయింది. ఒకప్పుడు ఇది 100 డాలర్ల కంటే కూడా ఎక్కువగా ఉండేది. క్రూడ్ ధరల పతనంతో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కాస్త ఊరట లభించింది.

అయితే  పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం పెట్రోల్, డీజిల్ పై లీటరకు రూ.2 సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.  ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని నాలుగు సార్లు పెంచారు. ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా లీటర్ పెట్రోల్ పై రూ.7.75 , లీటర్ డీజిల్ పై రూ 6.50 వినియోగదారులకు భారం పడనుంది. నవంబర్ నుంచి 4 సార్లు ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా ఖజానాకు రూ.20 వేల కోట్ల ఆదాయం చేకూరుతుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  

Other Articles