Ex trinamool minister demands cbi probe into brothers death

Manjul Krishna Thakur, Ex-Trinamool minister, Kapil Krishna Thakur, Trinamool Congress MP, CBI, manul krishna demands cbi probe, ex minister demands cbi probe, manjul krishna critises mamata government, Manjul Krishna joins bjp, Manjul Krishna suspects on his brother death,

Alleging that Trinamool Congress MP and his elder brother Kapil Krishna Thakur's death was the result of a conspiracy, Manjul Krishna Thakur - who resigned the West Bengal cabinet to join the BJP - has demanded a CBI probe into his death.

రోజు గడవకముందే అస్త్రాలను ఎక్కుపెట్టిన మంజుల్ కృష్ణ

Posted: 01/16/2015 01:12 PM IST
Ex trinamool minister demands cbi probe into brothers death

తృణముల్ కాంగ్రెస్ పార్టీకి, మమత బెనర్జీ సర్కార్ లోని మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన బీజేపిలో చేరిన మరుక్షణం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు మాజీ మంత్రి మంజుల్ కృష్ణ థాకూర్. ఒక్క రోజు కూడా గడవక ముందే.. ఆయన మమతా బెనర్జీ సర్కార్ పై విమర్శలు చేశారు. ఇన్నాళ్లు మమత పంచన వున్న ఆ నేత.. మంత్రి పదవిని నిర్వహించినా.. తనకు అధిపత్యం లభించలేదన్న అక్కస్సును కూడా వెల్లగక్కారు. అంతేకాదు తన సోదరుడు, పార్లమెంట్ సభ్యుడైన కపిల్ కృష్ణ థాకూర్ ది సహజ మరణం కాదని అనుమానాన్ని వ్యక్తం చేశారు.

తన సోదరుడి ఎంపీ కపిల్ కృష్ణ ఠాకూర్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మంజుల్ కృష్ణ ఠాకూర్ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొల్కతాలో విలేకర్ల సమావేశంలో మంజుల్ మాట్లాడుతూ... కపిల్ది సహజ మరణం కాదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆయన మృతి వెనకు కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సీబీఐ విచారణతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కపిల్ కృష్ణ ఠాకూర్  24 ఉత్తర పరిగణల జిల్లాలోని బంగన్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే గతేడాది అక్టోబర్ స్వల్ప అస్వస్థతతో ఆయన మరణించిన విషయం విదితమే. దాంతో బంగన్ లోక్ సభ స్థానానికి ఫిబ్రవరి 13 ఉప ఎన్నిక జరగనుంది.

మమతా బెనర్జీ కేబినెట్లో మంజుల్ కృష్ణ ఠాకూర్ శరణార్థులు, పునరావాస, సహాయ చర్యల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన గురువారం మంత్రి పదవితోపాటు టీఎంసీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కమలం తీర్థం పుచ్చుకున్నారు. దాంతో మమతా దీదీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు శారదా స్కామ్లో చిక్కుకుని పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles