Woman in goods train

woman in goods train, suspicious woman, woman held in tamilnadi, woman travelling in goods train, goods train, woman hiding in goods train, police questions women, terror threat to madhurai, woman terrorist, coimbatore, ap woman, kattupalli harbour, ponneri dsp, minjur

suspicious woman held for travalling in goods train, tamilnadu police questions her

ఎవరా యువతి..? అలా ఎందుకు చేసింది..?

Posted: 01/16/2015 09:24 AM IST
Woman in goods train

ఉగ్రవాదాలు ఎక్కడ ఎప్పుడు దాడులకు తెగబడతారో తెలియని పరిస్థితుల్లో తమిళనాడులో ఓ యువతి కలకలం సృష్టించింది. ఓ గూడ్స్ రైలులో ఓ యువతి నక్కి ఉండటం.. కొద్ది సేపు పోలీసులను ఉత్కంఠకు గురిచేసింది. కోయంబత్తూరు నుంచి వచ్చిన గూడ్స్ రైలులో ఓ యువతి నక్కి వుండడాన్ని చెన్నైలో భద్రతా సిబ్బంది గుర్తించారు. గూడ్స్ రైలులో నక్కి రావాల్సిన అవసరం యువతికి ఎందుకు వచ్చింది..? ఇంతకీ అమె ఎవరు..? ఆమె  తీవ్ర వాదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అమెను చేధించి పట్టుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన యువతిగా భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక కేంద్రం మదురై తీవ్రవాదుల హిట్‌లిస్టులో ఉండడంతో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరి మీదైనా సరే చిన్న పాటి అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని విచారించడం, ఆపై విడుదల చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో  కాట్టుపల్లి హార్బర్‌కు వచ్చిన గూడ్స్ రైల్లో ఓ యువతి నక్కి ఉండడం చర్చనీయాంశంగా మారింది.
 
 చెన్నై శివారులోని పొన్నేరి - మీంజూర్ సమీపంలోని కాట్టు పల్లి హార్బర్‌కు బొగ్గు రవాణా అవుతోంది. ఇక్కడికి వచ్చే నేల బొగ్గును రాష్ర్టంలోని తూత్తుకుడి, మెట్టూరు, ఉత్తర చెన్నై తదితర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పంపిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో కోయంబత్తూరు నుంచి చెన్నైకు ఓ గూడ్స్ రైలు వచ్చింది. ఉత్తర చెన్నై విద్యుత్ కేంద్రానికి సమీపంలో కాట్టు పల్లి వైపుగా వెళ్తున్న ఈ గూడ్స్‌లోని ఓ  బోగిలో ఎవరో ఉన్నట్టుగా భద్రతా సిబ్బంది గుర్తించారు.
 
రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది అన్ని బోగీలను పరిశీలించారు. ఓ బోగిలో యువతి నక్కి ఉండటంతో కాసేపు ఆందోళనలో పడ్డారు. ఆమెను అదుపులోకి తీసుకుని పొన్నేరి డీఎస్పీ  శేఖర్‌కు అప్పగించారు. ఆమెను తీవ్రంగా విచారిస్తున్నారు. 21 ఏళ్ల ఆ యువతి పేరు స్టాన్లీగా ఆంధ్ర వాసిగా భావిస్తున్నారు. ఆమె మెట్టూరులో గూడ్స్‌లోకి ఎక్కినట్టు తేలింది. అయితే, మెట్టూరు వద్ద ఆమె ఎలా గూడ్స్‌లో ఎక్కిందో,    అక్కడి భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఎలా ప్రవేశించ గలిగిందోనన్న అనుమానాలు నెలకొన్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  goods train  harbour  

Other Articles