Chief minister gives away ancestral property to government

naveen patnaik, odisha chief minister, ancestral property, Cm's elder brother Prem Patnaik, dedicated ‘Anand Bhawan’, birthplace of their father Biju Patnaik, birthplace of former chief minister ఃBiju Patnaik, Arun patnaik, documents hand overed to district collector,

Cm Naveen Patnaik and his elder brother Prem Patnaik on Tuesday dedicated ‘Anand Bhawan’, the birthplace of their father and former chief minister Biju Patnaik to the Odisha government.

ఇతనేం ముఖ్యమంత్రి..? ప్రభుత్వానికి ఆస్తులను రాసిస్తారా..?

Posted: 01/13/2015 06:53 PM IST
Chief minister gives away ancestral property to government

రాజకీయాల్లోకి వస్తే.. ఆరాచకాలను సృష్టించైనైనా సరే.. ఆస్తులు కూడగట్టుకోవాలని చూసే రాజకీయ నాయకులు వున్న ఈ రోజుల్లో, తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చిన నాయకులు వుంటారా..? అంటే అరుదనే చెప్పాలి. కానీ అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరిగా నవీన్ పట్నాయక్ నిలుస్తారని ఎవరైనా ఊహిస్తారా..? పాత తరం ధోరణి, సాధారణ వేషాధారణ, హంగు ఆర్భాటాలకు దూరంగా సామాన్యుడిని తలపించేలా వుంటే నవీన్ పట్నాయక్.. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. తన తండ్రి పేరిట పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి గత నాలుగు పర్యాయాలుగా ఒడిషాలో తనకు ఎదురులేదని తెలిసి కూడా తన నడవడికలో, ఆహార్యంలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నారు.

తాజాగా, తన తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని కూడా వద్దని చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రమే. తన వారసులకు ఆస్తులను అందజేయాలని ఆలోచించే నాయకులు రాజ్యమేలుతున్న తరుణంలో నవీన్ పట్నాయక్ ఈ త్యాగం చేశారు. తన తండ్రి బిజూ పట్నాయక్ వారసత్వంగా ఇచ్చిన 10 కోట్ల రూపాయల ఆస్తులను ఆయన ప్రభుత్వానికి రాసిచ్చేశారు.

కటక్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన ఈ ఆస్తులను ప్రభుత్వం పేరుమీద రిజిస్ట్రేషన్ చేసేశారు. ఎప్పుడూ తెల్లటి లాల్చీ, పైజమా మాత్రమే ధరించి ఉండే నవీన్ పట్నాయక్.. ఇప్పుడు మరింత నిరాడంబరత ప్రదర్శించి, తండ్రి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేశారు. 1997లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పేరుమీద బిజూ జనతాదళ్ అనే పార్టీని స్థాపించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : naveen patnaik  odisha chief minister  ancestral property  

Other Articles