Two children injured in crude bomb blast two more bombs found

crude bomb blast at dum dum, dum dum railway station, two children injured in dumdum bomb blast, Bomb blast, Kolkata, West Bengal, children, Dum Dum, Indian Railways, Terrorism, two crude bombs disposed, one seriously injured in dumdum blast, no interuption of trains, dumdum blast no impact on train movement

A crude bomb kept in a bag exploded near the Dum Dum cantonment on Satuday, leaving two children injured.

ఢంఢం రైల్వే స్టేషన్ వద్ద బాంబు పేలుడు

Posted: 01/11/2015 12:40 AM IST
Two children injured in crude bomb blast two more bombs found

కోల్కతా డమ్ డమ్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి సంభవించిన బాంబు పేలుడులో ఇద్దరు బాలురు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులైన సఫీక్, షారుఖ్ అనే ఇద్దరు బాలురను హుటాహుటిన ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్సను అందజేస్తున్నారు. ఢం ఢం కంటోన్మెంట్ ప్రాంతంలోని ఢంఢం రైల్వేస్టేషన్ గుర్తు తెలియని అగంతకులు బాంబు దాడులకు పాల్పడ్డారు. రైల్వే స్టేషన్ లోని గేట్ నెంబర్ 2 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

రైల్వే గేటు వద్ద పడివున్న ఓ బ్యాగును చూసిన ఇద్దరు బాలురు దానిని తెరచి అందులో వున్న టిపిన్ బాక్సును తెరిచేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఒక బాంబు పేలింది. కాగా బ్యాగులో మరో రెండు బాంబులు వున్నాయని వాటిని స్వాథీనం చేసుకుని నిర్వీర్యం చేశామని రంగంలోకి దిగిన బాంబు స్వాడ్ అధికారులు తెలిపారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టంది. అయితే ఈ ఘటనతో రైలు ప్రయాణాలకు ఎలాంటి విఘాతం కలగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolkata  Dum Dum cantonment  bomb blast  

Other Articles