Kouachi brothers killed in charlie hebdo hunt

Kouachi Brothers Killed, Kouachi brothers dead, Kouachi brothers, Kouachi Cherrif, pairs firing, paris firing latest, paris firing update, charlie hebdo attack, charlie hebdo, france latest updates

Kouachi brothers killed in Charlie Hebdo hunt : France police killed Kouachi brothers after 2 days of hunt and, hours of chasing operation. paris officails says both terrorist brothers killed but still high alert is going with suspect of more attacks

ప్యారిస్ లో కౌచి బ్రదర్స్ కేల్ ఖతం

Posted: 01/10/2015 07:35 AM IST
Kouachi brothers killed in charlie hebdo hunt

మూడ్రోజులుగా ప్యారిస్ లో నెలకొన్న భయాందోళనలకు తెరపడింది. మూడ్రోజుల పాటు దేశం మొత్తాన్ని వణికించిన కౌచి సోదరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శుక్రవారం జరిగిన ఛేజింగ్ ఆపరేషన్ లో ఉగ్రవాద సోదరులిద్దరూ చనిపోయారు. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఛేజింగ్, ఎన్ కౌంటర్ ఆపరేషన్ హాలీవుడ్ సినిమాను తలపించింది. రోడ్లపై చేజింగ్ లు కాల్పులతో పాటు, భారీగా వెంబడించే పోలిసు వాహనాలు, గగనతలం నుంచి నిఘాపెట్టిన హెలికాప్టర్లు, తప్పించుకునేందుకు మహిళను బంధీగా పట్టుకున్న ఉగ్రవాదులు.., అంతా చూస్తుంతే భారీ హాలీవుడ్ యాక్షన్ మూవీని చూసినట్లే కన్పిస్తుంది.

ఆపరేషన్ జరిగిందిలా...

రెండ్రోజులుగా వరుసగా కాల్పులకు పాల్పడుతున్న కౌచి సోదరులు ఓ మహిళ కారును దొంగతనం చేసి అందులో తిరుగుతున్నారు. శుక్రవారం ఉదయం అనుమానాస్పద కారు ఈశాన్య ప్యారిస్ లో పోలిసుల కంట పడటంతో వెంబడించారు. ఇదే సమయంలో కారు నుంచి పోలిసులపై కాల్పులు మొదలయ్యాయి. దీంతో వారు అనుమానించింది నిజమయింది. భద్రతా బలగాలకు సమాచారం అందించారు. అయితే అప్పటికే తీవ్రవాదులు ఓ మహిళ, చిన్నారిని బంధీగా పట్టుకుని డమర్టిన్ ఎన్-గోయెల్ ప్రాంతంలోని ప్రింటింగ్ ప్రెస్ లో దాక్కున్నారు. భారీ ఎత్తున చేరుకున్న భద్రతా బలగాలు స్థానికంగా నిషేదాజ్ఞలు ప్రకటించాయి. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దనీ, కిటికీలు, తలుపులు మూసుకోవాలని హెచ్చరించారు. షాపులు మూసివేయించారు. రోడ్లన్నీ బ్లాక్ చేయటంతో పాటు, ఎయిర్ పోర్టు లోని రెండు రన్ వేలను కూడా మూసివేశారు.

మధ్యాహ్నం నుంచి మొదలైన బ్లాక్ మెయిలింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. అప్పటి వరకు ఓపిగ్గా ఎదురుచూసిన పోలిసులు రాత్రి కావటంతోనే దాడి మొదలు పెట్టారు. ఆపరేషన్ లో స్వయంగా పాల్గొన్న రెండు వేల మంది పోలీసులు చిన్న భవనంను చుట్టుముట్టారు. దీంతో కౌచీ సోదరులు తప్పించుకునే అవకాశం లేకపోయింది. అయినా సరే వారు మహిళను వదిలి పెట్టకపోవటంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపి ఇద్దర్నీ హతమార్చాయి.

నరమేధంకు సంబంధించి అనుమానిత ఉగ్రవాదులను అంతమొందించామని ప్యారిస్ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం హై అలర్ట్ మాత్రం కొనసాగుతోందని అంటున్నారు. ప్యారిస్ సహా దేశంలోని మిగతా ప్రాంతంలో దాడులు జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఆపరేషన్ విజయవంతంగా ముగియటం పట్ల ఫ్రాన్స్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kouachi brothers  paris attack  charlie hebdo  

Other Articles