V hanmantha rao on tpcc president post

V Hanumantha Rao, V Hanumantha Rao tpcc, V Hanumantha Rao tpcc president, V Hanumantha Rao wants tpcc president, V Hanumantha Rao latest, V Hanumantha Rao comments, telangana congress, Andhra Pradesh congress, Telangana latest news, Trs, VH comments

V Hanmantha Rao on TPCC President Post : Telangana congress senior leader V Hanumantha Rao defends about his comments on party state president post. my wish to become pcc president and asking for that is not objectable says V Hanumantha Rao

మీరే చెప్పండి... న్యాయమా కాదా...?

Posted: 01/09/2015 04:27 PM IST
V hanmantha rao on tpcc president post

ప్రజల మనిషిగా ఉండే కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు న్యాయం చెప్పాలని ప్రజలనే అడుగుతున్నారు. తాను తెలంగాణ కాంగ్రెస్ ప్రసిడెంట్ అవుతానంటే వస్తున్న విమర్శల పట్ల న్యాయం చేయాలని కోరుతున్నాడు. పార్టీ కోసం మొదటి నుంచి సేవ చేసుకుంటూ వస్తూ.. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ వీడకుండా ఉన్న తనకు కాకుండా ఇంకెవరికి ఈ పీఠం దక్కించుకునే అర్హత ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పీసీసీ పదవి కోరుకోవటంపై వస్తున్న విమర్శల పట్ల ఘాటుగా స్పందించారు. మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తులు ఎమ్మెల్సీలు కాగా.., తాను పీసీసీ ప్రసిడెంట్ అయితే తప్పేముందో చెప్పాలని కోరుతున్నారు.

ఈ పదవికి డీఎస్ సహా తెలంగాణ కాంగ్రెస్ లోని ముఖ్య నేతలు పోటి పడుతున్న నేపథ్యంలో వారందరికంటే తానే ఉత్తముడినని వీహెచ్ చెప్పుకుంటున్నాడు. ఈనెల 20న దిగ్విజయ్ సింగ్ వచ్చి పార్టీ బలోపేతంపై నిర్ణయాలు తీసుకుంటారని అప్పుడు తనకే అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నయంగా చెప్పుకున్నారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్సే కాబట్టి బీజేపీ పాత్ర ఏమి లేదని చెప్పారు.

వీహెచ్ విషయానికి వస్తే..., కాంగ్రెస్ కు అపరవిధేయుడుగా, గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి. తొలి నుంచీ పార్టీ వెంట నడిచి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు వ్యక్తిగత పరిచయం, పలుకుబడి ఉన్న వ్యక్తి. అయినా సరే ఎక్కువగా ఎన్నికల్లో పోటి చేయలేదు. వీహెచ్ సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇచ్చి నాయకత్వం ఆయన్ను గౌరవించింది. కాని పీసీసీ అధ్యక్ష పదవిపై ఎలా స్పందిస్తుందో చెప్పలేము. చాలామంది నేతలు పోటిలో ఉన్న తరుణంలో సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తుందా లేక, లాబీయింగ్ కు లొంగుతుందా తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : V Hanumantha Rao  TPCC  Telangana latest  

Other Articles