Amit shah comments on tdp bjp relation

Amit Shah on TDP, Amit Shah Andhra Pradesh tour, Amit Shah Telangana Tour, Amit Shah latest, Amit Shah comments, Amit Shah on congress, Amit Shah on AP development, Amit Shah on BJP In Andhra Pradesh, Andhra Pradesh BJP, TDP BJP Relation, BJP in Telangana, Andhra Pradesh latest

Amit shah comments on TDP BJP Relation : BJP President Amit Shah says his party will strengthen in Andhra Pradesh but it not means that opposite to tdp. telugu desam party bharatiya janata party maintain friendship, and central party will support AP in development

టార్గెట్ టీడీపీ అని చెప్పలేకపోతున్నాడు

Posted: 01/09/2015 01:37 PM IST
Amit shah comments on tdp bjp relation

ఒకరు గెలిచారు అంటే మరొకరు ఓడినట్లే లెక్క. అదేవిధంగా ఇద్దర్లో ఒకరు ఎదుగుతున్నారు అంటే మరొకరు తక్కువ స్థాయిలో ఉన్నట్లే అర్థం. కాని బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇది తప్పు అంటున్నారు. ఏపీలో బీజేపి బలోపేతం కావాల్సిన అవసరం ఉందంటున్నారు. దీనికి అర్థం టీడీపీని వ్యతిరేకించటం కాదని ఆయన చెప్తున్నారు. ఏపీ పర్యటనలో ఉన్న అమిత్ షా విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లోపు కమలదళం మరింత బలోపేతమై ఎక్కువ స్థానాల్లో పోటి చేసేలా ఎదగాలని కార్యకర్తలకు సూచించారు.

అన్ని రాష్ర్టాల్లో బీజేపిని విస్తరించటంతో పాటు బలోపేతం చేస్తామన్నారు. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరేవారిని సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రాష్ర్ట అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుందని హామి ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని చెప్పారు.

తెలుగు రాష్ర్టాల్లో పార్టీ బలోపేతం కోసం వచ్చిన అమిత్ షా, తమ టార్గెట్ ఏమిటో ప్రకటించలేకపోతున్నారు. బీజేపీ ఎదగాలంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న వైసీపీ లేదా టీడీపీ తగ్గాల్సిందే. ఈ విషయాన్ని పరోక్షంగా చెప్తున్న బీజేపి సారధి, బయటకు మాత్రం క్లారిటీగా చెప్పలేకపోతున్నాడు. ఇందుకు కారణం సెంటిమెంట్ అని విశ్లేషకులు చెప్తున్నారు. టీడీపీ కంటే బలోపేతం కావాలని బయటకు ప్రకటిస్తే.. మిత్రపక్షంతో పాటు, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశముందని కమల నేతలకు లోలోపల అనుమానాలు వస్తున్నాయట. దీంతో టీడీపీ టార్గెట్ అని చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది. టీడీపీని నొప్పించకుండా.., వైసీపీని కదిలించకుండా పార్టిని ఎలా బలోపేతం చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  TDP  BJP Andhra Pradesh  

Other Articles