Komatireddy venkat reddy takes on chandrababu

telangana congress MLA komatireddy venkat reddy, mla komatireddy venkat reddy, mla komati reddy fires on chandra babu, komati reddy asks TTdp leaders to revolt, ttdp leaders should revolt on chandrababu, komati reddy alleges babu stopping irrigation water

komatireddy venkat reddy takes on chandrababu and questions why Telangana Tdp leaders does not revolt on party president.

సాగర్ నీటిపై తెలంగాణ టీడీపీ నేతలు తిరగబడరేం..?

Posted: 01/07/2015 05:44 PM IST
Komatireddy venkat reddy takes on chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలోని జిల్లాలకు సాగు నీరు రాకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ నుంచి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రెండో పంటకు నీళ్లు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రాంతీయ తత్వం లేదని, తనకు రెండు రాష్ట్రాల అభివృద్ది కావాలని ప్రకటనలు గుప్పించే చంద్రబాబు వ్యవహార తీరును తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నించాలని సూచించారు.

తెలంగాణ టీడీపీ నేతలు ఈ అంశంపై చంద్రబాబును ప్రశ్నించాలని, అవసరమైతే తిరగబడాలని కోరారు. సాగర్ ఎడమ కాలువ నుంచి నల్గొండ, ఖమ్మం జిల్లాల చెరువులను నింపైనా రెండో పంటకు నీళ్లు ఇచ్చేలా తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూతో జనాలు మరణిస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Komatireddy venkat reddy  T congress leader  chandrababu naidu  AP CM  nagarjuna sagar  

Other Articles