Baba ramdev tries his hand at wrestling in haridwar

yoga guru baba ramdev, baba ramdev wrestling, yoga guru ramdev wrestling, foundation day, Patanjali Yogpeeth foundation day, haridwar, guest,

Baba Ramdev tries his hand at wrestling in Haridwar on the foundation day of Patanjali Yogpeeth. Baba Ramdev has entered the wrestling ring and exhibit his “dangal” skills that he picked up during his heydays at the “gurukul”.

ITEMVIDEOS: మల్లయోధులను మట్టికరిపించిన బాబా రాందేవ్

Posted: 01/06/2015 04:26 PM IST
Baba ramdev tries his hand at wrestling in haridwar

ఎయిడ్స్ వ్యాధిని కూడా యోగా ద్వారా నయం చేస్తానని తన వ్యాఖ్యాలతో సంచలనాలకు తెరలేపిన యోగా గురు, ఆద్యాత్మిక వేత్త బాబా రాందేవ్.. నిజంగానే తన అద్భుతాలను చూపిస్తున్నాడు. నిత్యం యోగాభ్యాసం చేసే వాళ్లు మల్లయోధులు కన్నా శక్తివంతులని నిరూపించారు. తన వద్ద యోగా విద్య మాత్రమే కాకుండా మరిన్ని రంగాలలోనూ నైపుణ్యముందని నిరూపించారు. హరిద్వార్ లోని దివ్యయోగా మందిర్ ట్రస్టులో పతాంజలి యోగాఫీఠం ఆద్వర్యంలో జాతీయ స్థాయిలో కబడ్డి సహా మల్లయుద్ద పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లయుధ్ద పోటీలలో బాబా రాందేవ్ పాల్గని అక్కడి వారని విస్మయానికి గురి చేశారు. ఏకంగా మల్లయుధ్దం వీరులను మట్టికరిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగాతో మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదని చెప్పారు. వరుసగా ముగ్గురు మల్లయోధులతో ఆయన పోరాడి వారిని ఓడించడానికి తన యోగానే దోహదపడిందన్నారు. ఇప్పటికే యోగా చికిత్స ద్వారా, అమూల్యమైన మూలికల ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చనని ఆయన చికిత్సలు పొందిన భక్తులు అయనను శ్లాఘించడం నిత్యం చూస్తూనే వున్నాం. ఈ పోటీలలో నెగ్గిన బాబా రాందేవ్ ను చూసిఇక మీదట ఆయనను యోగా గురువనే కాదు మల్లయోధుడని కూడా పిలచుకోవచ్చు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramdev  wrestling  Patanjali Yogpeeth foundation day  

Other Articles