Diesel petrol prices likely to be cut down

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in Indian currency

Diesel & petrol prices likely to be cut down as crude oil prices decreased to 50 American dollars

ఐదేళ్ల కనిష్టానికి క్రూడ్ అయిల్ ధర.. తగ్గనున్న ఇంధన ధరలు

Posted: 01/06/2015 01:36 PM IST
Diesel petrol prices likely to be cut down

అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి. గతంలో పెరగడమే తప్ప తరగడం తెలియక పైపైకి ఎగబాకిన చమురు ధరలు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో కిందకు దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు మరింత తగ్గడంతో పెట్రోల్ ధరలు మళ్లీ తగ్గనున్నాయి. అమెరికా మార్కటింగ్ చేసే క్రూడ్ ఆయిల్ ధరల బ్యారల్ కు 50 డాలర్లకు దిగువకు చేరుకుంది. దీంతో మన దేశంలో కూడా మరోమారు పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. పన్ను రాయతీల కోసం పెద్ద ఎత్తున అమ్మాకానికి వున్న క్రూడ్ అయిల్ స్టాక్..  ధరలు తగ్గడానికి కారణంగా మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. 55 డాలర్ల వద్దనున్న బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర.. ఏకంగా నాలుగు డాలర్లు తగ్గి 50 డాలర్లకు చేరుకుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర మళ్లీ ఆరు శాతం తగ్గింది. బ్యారెల్ ధర 50 డాలర్లకు చేరుకుంది. దీంతో ఐదేళ్ల కనిష్ట స్థాయికి ఇందన ధరలు చేరుకున్నాయి. సరిగ్గా 2009 ఏప్రిల్ మాసంలో ఇంధన ధరలు ఈ మేరకు ధరలను నమోదు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడిన ధరలను నియంత్రణ చేస్తున్న చమురు సంస్థలు మరో మారు రెండు నుంచి మూడు రూపాయల మేర ఇంధన ధరలను తగ్గించనున్నాయి. దీంతో మన దేశంలో మళ్లి ఇంధన ధరలు తగ్నున్నాయి. కాగా, 2009 జులై నెలలో హైదరాబాద్ లో లీటరు పెట్రల్ ధర 49 రూపాయలుగా వుండగా, లీటరు డీజిల్ ధర 37 రూపాయలుగా వుండింది. సబ్సీడీ వంటగ్యాస్ సిలిండర్ ధర 290 రూపాయలుగా నమోదు చేసుకుంది. అయితే అంతర్జాతీయంగా ఏప్రిల్ 2009 ధరలు నమోదు కావడంతో ప్రస్తుతం జులై 2009 ఇంధన ధరల కన్నా తక్కువగా నమోదు కావాల్సి వుంది. అయితే ఆ స్థాయిలో పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గడం లేదు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  

Other Articles