Saina nehwal may be recommended for padma bhushan award sarbananda sonowal to ndtv

Saina Nehwal, Saina Nehwal for padma bhushan, padma bhushan awardees, padma bhushan awardees 2015, Saina Nehwal padma bhushan

Saina Nehwal had earlier expressed anger that her name was not recommended for the Padma Bhushan award

సైనా నెహ్వాల్ కు పద్మ భూషణ్?!

Posted: 01/05/2015 03:08 PM IST
Saina nehwal may be recommended for padma bhushan award sarbananda sonowal to ndtv

ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేరును సిఫార్సు చేయడానికి కేంద్రం సిద్దమయ్యింది. ఈ అవార్డు కోసం సైనా చేసుకున్న దరఖాస్తు శనివారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు అందింది. తొలుత ఆమె పేరును పద్మ భూషణ్ అవార్డుకు పంపే అవకాశాలను పరిశీలించిన పిదప అందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు రంగాలలోని ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

‘పద్మభూషణ్’ అవార్డు ఎంపిక కోసం తన దరఖాస్తును తిరస్కరించడంపై ఆమె ఆవేదనతోపాటు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల క్రితం ‘పద్మశ్రీ’ పొందిన తనకు నిబంధనల ప్రకారం ఈ అవార్డు పొందే అర్హత ఉందని, తనను కాదని రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ఎలా పరిగణనలోకి తీసుకున్నారని సైనా ప్రశ్నించింది. దీంతో డైలామాలో పడిన క్రీడామంత్రిత్వ శాఖ చివరకు సైనా పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించేందుకు సిద్దమయ్యింది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం సైనా కు పద్మ భూషణ్ దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తుంది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  padma bhushan  recommended  

Other Articles