Fire employees hulchul in moula ali fire station

fire department employees, moula ali fire station, moula ali fire station employees, fire employees celebrate new year, fire employees drunk and dance, fire employees hulchul, fire employees new year hulchul,

fire department employees new year celebrations on duty in moula ali fire station goes viral on social media

ITEMVIDEOS: ‘అగ్గి’ రాజేసిన సిబ్బంది వీడియో...!

Posted: 01/03/2015 04:54 PM IST
Fire employees hulchul in moula ali fire station

నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు అందరి మాదిరిగానే వాళ్లు కూడా సిద్దమయ్యారు. చిన్నపాటి మైక్ సెట్ తెచ్చుకున్నారు. సరిపడా మద్యాన్ని ముందుగానే తెచ్చుకున్నారు. అందకు మంచిగ్ గా మంచి మంచి శాఖాహారాలు, మాంసాహాలతో కూడిన ఐటమ్స్ రెడీ చేసుకున్నారు. తీరా ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అన్నట్టుగా వారంతా ఎదురుచూశారు. వారికి కావాల్సిన చందర్ రావు (చంద్రుడు) రానే వచ్చాడు. అంతే ఇక మద్యాన్ని ఒంట పట్టించేందుకు వారంతా తీవ్రంగా కుస్తీ పడ్డారు. ఇప్పుడు కూడా వారు మరో ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. అదే టైమ్ సరిగ్గా చీకటి పడింది. అక్కడి వారంతా వారి వారి సంబరాల్లో మునిగి తేలుతుండగా, ఇక వీరి స్తానికులను మోరెత్తించే పాటలు, అందుకనుగూణంగా చిందులు వేశారు. ఇంతకీ వారెవరో తెలుసా..?

తార్నాకలోని మౌలాలి అగ్నిమాపక కేంద్రంలో సిబ్బంది. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా అగ్నిమాపక కేంద్రంలోని ఫైర్ మెన్లు అమరనాథ్, ఏ మల్లేష్, ఓం నమశ్శివాయలతోపాటు ఫైరింజన్ డ్రైవర్ వీరాస్వామి మందు వేశారు. అనంతరం పాటలు పెద్దగా పెట్టుకుని చిందేశారు. ఆ విషయాన్ని ఆగంతకులు ఫోటోలు తీసి.. మీడియా వారికి అందజేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు మీడియాలో హల్చల్ చేశాయి. ఈ ఘటనపై వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు మౌలాలి అగ్నిమాపక కేంద్రం ఉన్నతాధికారి చంద్రశేఖర్ను సంప్రదించేందుకు ప్రయత్నించాగా అతనితో పాటు మందేసి చిందేసిన సదరు నలుగురు మందుబాబుల సెల్ఫోన్లు కూడా మూగబోయాయి. నగరమంతా  నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే... తమను రక్షించేది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నూతన సంవత్సర వేళను ఎంజాయ్ చేయడంలో తప్పులేదని, అయితే బహాటంగా తమ కార్యాలయాల్లో, అదీనూ విధుల్లో వుండగా చేయడం ఎంత వరకు సమంజసమో వారే నిర్ణయించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fire department employees  moula ali fire station  31 day celebrations  

Other Articles