Nara lokesh driving tdp government for papa chandrababu naidu

nara lokesh, chandra babu naidu, tdp party official, tdp party, andhra pradesh cm, chandra babu naidu son, ap cm son

Nara Lokesh driving TDP government for Papa Chandrababu Naidu, Lokesh is an able leader who is looking after party affairs, but he cannot be dubbed political successor to Chandrababu Naidu as TDP is a democratic party.

ఇక లోకేష్ నడుపుతాడట సైకిల్ ను.......

Posted: 01/03/2015 11:33 AM IST
Nara lokesh driving tdp government for papa chandrababu naidu

యువ నేత నార లోకేష్ ఇప్పటికే టి.డి.పి కి సంబంధించిన కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాన్ని అదరగొట్టటానికి సామజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా అప్పుడప్పుడు వాగ్బాణాలు సంధిస్తూ, తనదైన శైలిలో పార్టీ కి సేవలందిస్తున్న విషయం తెలిసిందే. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా పార్టీ లోని పలు విభాగాలపై ఇప్పటికి కొంత పట్టు సాధించారని టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. పార్టీ కార్యకర్తల కోసం ఇప్పటికే ఉన్న కాల్ సెంటర్ ని ఇంకాస్త అభివృద్ధి చేసి దాని పని సమయాలను కూడా పొడగించి, కార్యకర్తల పట్ల పార్టీకి ఏ విధమైన చిత్తశుద్ధి ఉందొ చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటె అప్పుడే పార్టీ లో ఈ చిన బాబు కు ప్రాముఖ్యత మొదలయ్యింది. మంత్రులు మరియు పార్టీ సీనియర్లు ఇప్పటికే ఈ బాబు అప్పాయింట్మెంట్ కోసం పడి గాపులు కాస్తున్నారని సమాచారం. ఇప్పటికే బాబు పార్టీ పై పట్టు పెంచుకొని ఏ అవసరం ఉన్న పార్టీ కి అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారట. చంద్ర బాబు కూడా ఈ విషయం లో చిన్న బాబు కే పార్టీ పగ్గాలను అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్య్వ కార్యకలాపాల్లో తీరిక లేకుండా ఉండటం చేత, పార్టీ లోని కొన్ని కార్యకలాపాలను లోకేష్ కి అప్పగించారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ బాబు త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడతారని సమాచారం. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించి 2 లక్షల పైగా సభ్యత్వ నమోదు చేయించారు. దీనితో పార్టీ కార్యకర్తలతో పాటు సీనియరు లీడర్లు సైతం ఏ చిన్న సమస్య వచ్చిన ఈ చిన్న బాబు దగ్గరికి వెళ్తున్నారట..!!

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara chandra babu naidu  tdp party  nara lokesh  

Other Articles