Two terrorists boats came into indian waters

two terrorists boats came into Indian Waters : Indian Navy and Intelligence Bureau says two boats tried to enter into Indian Waters. One boat blew it self by terrorists an other was went back to pakistan. Indian Navy and Intelligence Bureau monitering situation in coastal borders

two terrorists boats came into Indian Waters : Indian Navy and Intelligence Bureau says two boats tried to enter into Indian Waters. One boat blew it self by terrorists an other was went back to pakistan. Indian Navy and Intelligence Bureau monitering situation in coastal borders

రెండు బోట్లు వచ్చాయి... మరొకటి ఏమయింది..?

Posted: 01/03/2015 08:01 AM IST
Two terrorists boats came into indian waters

26/11 తరహా దాడులకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర భగ్నమైన విషయం  తెలిసిందే. నూతన సంవత్సరం, రిపబ్లిక్ డే సందర్బంగా దాడులకు తెగబడేందుకు చేసిన ప్రయత్నాలను నేవి తిప్పికొట్టింది. భారత్ చేతికి చిక్కటం కంటే చావటమే మేలనుకుని పిరికిపందలు పేల్చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటనపై కేంద్రం ప్రకటన చేసింది. పాక్ వైపు నుంచి వచ్చిన బోట్ ఖచ్చితంగా ఉగ్రవాదులదే అని ప్రకటించింది. దీన్ని ఎప్పట్లాగే పాక్ ఖండించటం విశేషం.

ఇదిలా ఉండగా., పాక్ నుంచి రెండు బోట్లు బయల్దేరినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. నేవికి చెందిన హెలికాప్టర్లు కూడా అరేబియన్ సముంద్రంలో రెండు అనుమానిత బోట్లను చూశాయట. ఒకదాని తర్వాత మరొకటి కొంత దూరంతో ప్రయాణిస్తుండగా.., తొలి బోటు కోస్ట్ గార్డ్ కంట పడింది. వెంటనే అప్రమత్తమైన నేవీ.., బోటును వెంటాడింది. దొరికిపోతామనే భయంతో ఉగ్రవాదులు బోటుతో సహా తమను తాము పేల్చేసుకున్నారు. ఈ సమయంలో వీరి కదలికలను గమనించేందుకు నేవీ హెలికాప్టర్లు సముద్రఉపరితలంపై గాలింపు చేపట్టాయి. బోటులో అందరూ చనిపోయారా.. లేక ఎవరైనా మిగిలి ఉన్నారా అని గాలింపు జరిపాయి. ఇదే సమయంలో మరో బోటు ఉన్నట్లు గుర్తించాయి.

రెండవ బోటులో కూడా ఉగ్రవాదులు ఉన్నట్లు నేవీ హెలికాప్టర్లు గుర్తించాయి. విషయాన్ని కింద ఉన్న నేవి సిబ్బందికి అందించాయి. రెండవ బోటును ఎలాగైనా పట్టుకోవాలని కోస్ట్ గార్డ్ అప్రమత్తమయింది. అయితే తొలి బోటు పేల్చేసుకోవటంతో తామైనా బ్రతకాలని భావించి రెండవ బోటులోని ఉగ్రవాదులు వెనక్కి వెళ్లిపోయారు. నేవి వెంబడించే సమయానికి రెండవ బోటు పాక్ జలాల్లోకి ప్రవేశించింది. దీంతో కోస్ట్ గార్డ్ వెనక్కి వచ్చేసిందని చెప్తున్నారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan Boats  Pakistan terrorists  Indian Navy  

Other Articles