Chinese react to stampede deaths says they thought this happened only in india

Chinese react to stampede deaths, stampede deaths happens only in India, India, stampede, shanghai, shanghai stampede, socialism, disciplined people, chinese feel superior to indians, rapidly developing country india

The stampede has prompted unflattering comparisons with India, where stampedes are relatively common, another rapidly developing country and rival that many Chinese feel superior to.

ఎంత మదమెంత దుహంకారము.. ఇదేనా విజ్ఞత..?

Posted: 01/02/2015 11:22 PM IST
Chinese react to stampede deaths says they thought this happened only in india

చైనా దుహాంకారానికి పరాకాష్ట. భారత్ ఘనకీర్తని లెక్కించలేని పోరుగు దేశస్థులు.. అత్యంత చులకగా పరిగణించడంతో పాటు తమ దేశ అహంకారాన్ని బయటపెట్టారు. ఇందుకు తమ దేశ ఆర్థిక రాజధానిలో జరిగిన తోక్కిసలాట కారణంగా నిలిచింది. నూతన సంవత్సర సందర్భంగా షాంగాయ్ లో జరిగిన వేడుకల్లో తొక్కిసలాట చోట చేసుకుని 36 మంది ఆ దేశ పౌరులు మృత్యువాత పడ్డారు. సుమారుగా మరో 47 మంది క్షతగాత్రులయ్యారు. ఇందులో మహిళలే అధికంగా వున్నారు. క్షతగాత్రుల్లో ఒక మలేషియా, ముగ్గురు తైవాన్ కు చెందిన యువతులు కూడా వున్నారు. ఈ ఘటనపై భారత్ మిగతా ప్రపంచ దేశాల మాదిరిగానే అటుగా కాని, ఇటుగా కానీ స్పందించలేదు. ఇదే ఆ దేశంలో జరిగిన ఒక ఘటనగా మాత్రమే ప్రపంచ దేశాల కోణంలోనే భారత్ కూడా చూసింది.

అయితే ఈ ఘటనపై స్పందించిన చైనా స్పందించిన షాంగాయ్ నగరవాసులు అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. కేవలం భారత్ లో మాత్రమే తోక్కిసలాటలు జరుగుతాయన్ దారుణ విమర్శలకు పాల్పడ్డారు. వారి ఇంకిత జ్ఞానాన్ని మరచి, పొరుగు దేశంతో ఎలా వ్యవహరించాలన్న నైతికతను విస్మరించి భారత్ దేశాన్ని చులకన చేసి చూశారు. భారత్ దేశం తరహాలోనే చైనాలని షాంగాయ్ లో తొక్కిస లాట జరిగిందని అక్కడి వారు సరిపోల్చుకుంటున్నారు. అంతేకాదు., భారత్ లో ఫుణ్యక్షేత్రాల వద్ద ఎక్కువగా తొక్కిస లాట జరుగుతుందని వారు పేర్కోన్నారు. ఇది వారి విజ్ఞతను బహిర్గతం చేస్తుంది.

భారత్ పుణ్యభూమి, కర్మభూమి, హిందూ జనాభా అధికంగా ఉండి హిందుస్తాన్ గా బాసిల్లుతున్న దేశం. కేవలం విశిష్టమైనా రోజుల్లోనే కాకుండా ప్రతీ రోజూ దేశంలోని పుణ్యక్షేత్రాలకు భక్తులు వేలు, లక్షల సంఖ్యలో భగవంత్ దర్శనార్థం సందర్శిస్తు వుంటారు. అయితే ఎక్కడో ఎప్పుడో జరిగిన ఘటనలు చూపి భారత్ అంటే తొక్కిసలాట దేశంగా చైనీయులు అభివర్ణించడం ఎంత వరకు సమంజసం. భారత్ దేశాన్ని చిన్న చూపు చూడటం కూడా గౌరవ ప్రధం కాదు. అధిక జనాభా వుండి కూడా తాము క్రమశిక్షణ కల్గిన దేశంగా చెప్పుకునే చైనీయుల క్రమశిక్షణ ఎంతో ఈ ఘటన ద్వారా ఇట్టే బయటపడుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  India  stampede  shanghai  

Other Articles