Terrorists came in boat from pakistan

Indian Coast Guard foiled terror attack, terrorists boat, terrorists in boats, terrorists blew themselves, indian coast guard Operations DDG KR Nautiyal, suspicious Pakistani boat, possible terror attack, pak boat off Porbander coast,

The Indian Coast Guard foiled a possible terror attack bid when it intercepted a suspicious Pakistani boat off the Porbander coast in Gujarat.

వారు ఉగ్రవాదులే.. కాదు చేపలు పట్టేందుకు వచ్చినవాళ్లు..

Posted: 01/02/2015 10:52 PM IST
Terrorists came in boat from pakistan

పాకిస్థాన్ నుంచి పోరుబందర్ తీరం సమీపానికి మరబోటులో వచ్చింది టెర్రరిస్టులేనని భారత కోస్ట్ గార్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేఆర్ నౌతియాల్ చెప్పారు. డిసెంబర్ 31 రాత్రి అనుమానాస్పద బోటును గమనించామని, వెంటనే వారిని వెంటాడినట్టు తెలిపారు. తమను గమనించిన ఉగ్రవాదులు బోటుకు నిప్పుపెట్టుకున్నారని చెప్పారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బోటు సముద్రంలో మునిగిపోయినట్టు నౌతియాల్ వెల్లడించారు. ఇదిలావుండగా, కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు కొన్ని కీలక ఫోన్ కాల్స్ను రికార్డు చేశారు. ఉగ్రవాదులు ఆయుధాలు అందుకున్నట్టు ఫోన్ సంభాషణల్లో వెల్లడైంది. ఈ ఘటన అనంతరం పాక్ నుంచి కాల్స్ వచ్చినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. మరణించిన ఉగ్రవాద కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తామంటూ కొందరు ఫోన్లో మాట్లాడినట్టు వెల్లడైంది.

మరోవైపు పాకిస్థాన్ మాత్రం మరోసారి దాని దమననీతిని భయటపెట్టింది. ఉగ్రవాదులకు స్వర్గధామంలా పాకిస్థాన్ వుందన్న విమర్శలను కూడా పట్టించుకోని ఆ దేశం.. చివరకు సైనిక పాఠశాలపై కాల్పులకు తాలిబన్లు పాల్పడేవరకు కనువిప్పు కలగలేదు. ఇప్పుడు మరోమారు ఉగ్రవాదులను వెనకేస్తూ.. పోరబందర్ వద్ద కోస్ట్ గార్డు పోలీసులు తరమింది చేపలు పట్టే మరబోటునని పాకిస్థాన్ చెప్పింది. అది చాలదన్నట్లు భారత మీడియాపై విమర్శలు గుప్పించింది. భారత దేశ మీడియా జరిగిన ఘటనపై కొత్త కథనాన్ని అల్లిందని పేర్కోంది. ఈ మరబోటుతో ఉగ్రవాద సంబంధాలు వున్నాయని ఎక్కడా బయటపడలేదని తెలిపింది. ఈ బోటులో వున్న వారంతా కరాచీ కి దగ్గరలోని కేటీ బండర్ ప్రాంతానికి చెందిన వారని చెప్పింది.

అయితే భారత్ కానీ భారత దేశ మీడియా కానీ అది మరబోటు కాదని చెప్పడం లేదు. అది మరబోటే అయితే భారీ విస్పోటక పధార్థాలు ఎందుకున్నాయన్న ప్రశ్నకు సమాధానం పాకిస్థాన్ ప్రభుత్వమే చెప్పాలి. చేపలు పట్టే వారికి అంత భారీ స్థాయిలో విస్పోటక పధార్థాలు ఎలా లభించాయని, వాటిని తీసుకుని పోర్ బందర్ వద్దకు ఎందుకు చేరుకోవాలని ప్రయత్నించారని ప్రశ్నకు ఎం బదులిస్తుంది. అది చాలదన్నట్లు మరబోటులో వుంది జాలర్లను చెప్పడం ఉగ్రవాదులను వెనకేసుకుని రావడం కాక మరేమిటి..? దీనికి పాకిస్థాన్ ప్రభుత్వమే బదులివ్వాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Coast Guard  Pakistani fishing vessel  coast guard Operations  KR Nautiyal  

Other Articles