Indian government bans at least 32 websites for hosting pro isis content

Indian Government ban websites, central government bans 50 websites, Indian Government bans ISIS websites, ISIS websites banned by India, popular websites banned in India, BJP IT Cell National head Arvind Gupta, Blocking, Blocks, Department of Telecom, DoT, Government of India, Internet

India’s Department of Telecom has compelled ISPs to ban a group of popular websites at the DNS level. As the websites allegedly playing host to content favorable to terrorist group ISIS.

ముప్పును నిలువరించడానికి ఇలా కూడా చేస్తున్నారు...

Posted: 01/02/2015 01:23 PM IST
Indian government bans at least 32 websites for hosting pro isis content

నూతన సంవత్సర వేళ.. ఆ తరువాత వచ్చే గనతంత్ర దినోత్సవ వేళ.. ఇలా ప్రతి ప్రాముఖ్యత ఉన్న రోజున బాంబులు పెడతాం, హతమారుస్తాం, అలజడి సృష్టిస్తామంటూ బెదిరింపులకు పాల్పడే ఉగ్రవాదుల కార్యకాలపాలకు చెక్ పెట్టే పనిలో కేంద్రం నిమగ్నమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వున్న తీవ్రవాదుల మధ్య అనుసంధానాన్ని ముందుగా తొలగించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలకు  దోహదం చేస్తూ.. వారికి అనుకూలంగా వ్యవహరించే పలు వెబ్ సైట్ లపై దేశంలో నిషేదం విధించింది.

భారీ విధ్వంసానికి పథక రచన చేయడానికి యత్నాలు చేయనున్నట్లు ఇ:టెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల సంస్థకు చెందిన వెబ్ సైట్లపై కేంద్ర నిషేధం విధించింది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు ఫేస్ బుక్ , ట్విట్టర్ తో పలు రకాలైన యాభై వెబ్ సైట్లను నిషేధించినట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది.  ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు సంబంధించిన వెబ్ సైట్ల యూఆర్ఎల్ ని కూడా పూర్తిగా తొలగించింది. కాగా ముఖ్యంగా 32 వెబ్ సైట్లను ముందస్తుగా నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. బీజేపి ఐటీ విభాగం జాతీయ అధ్యక్షుడు అరవింద్ గుప్తా మాత్రమే ప్రభుత్వం పలు సైట్లను నిషేధించిన వార్తలను ధృవీకరిస్తున్నారు. ముంబై యాంటీ టెరరిస్టు స్వాడ్ పోలీసులతో పాటుగా ముంబై అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ పలు సైట్లను నిషేధించాలని కోరుతూ ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసిందని ఆయన పేర్కోన్నారు.

banned
 
అయితే నిషేధం ఉంచిన వెబ్ సైట్లపై నిఘా ఉంచాలని ఐటీ అధికారులకు, రా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాదులను కోల్ కతా లో అరెస్ట్ చేశారు. తీవ్ర వాదుల నుంచి 25 కేజీల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఉగ్రవాదులు మిలటరీ యూనిఫాంలో ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే.  వీరిలో ఒకరు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వారి వద్ద లభించిన ల్యాప్ టాప్ లో కీలక సమాచారం లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక దృవీకరణలు లేకుండా వైబ్ సైట్ లను ఎలా నిషేధిస్తారన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. మరోవైపు నవంబర్ 10 కోర్టు అదేశిస్తే.. నెలన్నర రోజుల పాటు కేంద్రం వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బీజేపి నేత అరవింద్ గుప్తా.. జాతీయ భద్రతను పరిగణలోకి తీసుకునే పలు వెబ్ పైట్లపై నిషేధాన్ని కోనసాగిస్తున్నట్లు చెప్పారు. యాంటి టెర్రరిస్టు స్వాడ్ ఆదేశాల నేపథ్యంలో నిషేదం కోనసాగుతుందన్నారు. అయితే ప్రభుత్వంలో ఎలాంటి హోదాలో లేని గుప్తా ఈ విషయమై స్పందించడం.. ప్రభుత్వం తరపున ఎవరూ స్పందించకపోవడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Government  websites  ISIS  Aravind gupta  

Other Articles