Unusual relationship of husband and wife

husband and wife, relationship of husband and relationship, true love between wife and husband, telangana wife and husband, husband behaviour with wife, wife behaviour with husband

A married couple is facing issues with their marriage.. when will they ever find true love..

ప్రత్యేక కథనం: భర్త అంటే మగాడు (భార్య-భర్త)

Posted: 12/30/2014 05:12 PM IST
Unusual relationship of husband and wife

భర్త అంటే మగాడు.....

నేను మగాన్ని అనే అహంకారం నేటి 21 వ శతాబ్దంలో పూర్తిగా కనుమరుగయింది.. ముఖ్యంగా ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వినబడే మాట.. నేను మగాన్ని 'నోరు మూసుకో' అని.... కానీ కాలం శాసించింది భర్తకి బంధం విలువ తెలిసొచ్చింది... బంధంతో పాటే బాద్యత ఉందని తెలుసుకున్నాడు... కాని భార్యతో కలిసి భర్త కొన్ని చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నాడెమో అనిపిస్తుంది... భార్య పట్ల కొన్ని సార్లు అసహనం ఆవేశం ప్రదర్శించవచ్చు... ఆ అసహనం ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయకూడదు... ఎందుకంటే భర్త అంటే భార్య మెడలో బంగారు తాడు వేసి భాధ్యత లేకుండా తిరిగేవాడు ఎంత మాత్రం కాదు.. అసలు నన్నడిగితే భర్త అంటేనే భాద్యత మల్లి భర్తకి నిర్వచనం అవసరం లేదు.. భర్త అంటే అన్ని తానే అయి భరించేవాడు కాదు ఇప్పుడు ఆ కాలంలో కూడా లేడు., భర్త అంటే బాధని పంచుకునేవాడు.. భర్త అంటే భార్య శరీరంలో సగ భాగం కాదు బాధల్లో కూడా సగ భాగం.. భర్త అంటే భారాన్ని మోసేవాడు... ఆ భారం భార్య కనుచూపు మేరలో కనిపించకుండా చేసేవాడు... భర్త అంటే భార్యకి మూరెడు మల్లెలు కొనివ్వటం కానే కాదు ఆ మూరెడు మల్లెల మధ్య జానెడు ప్రేమని పంచి ఇవ్వటం... భర్త అంటే శరీరాన్ని అనుభవించటం కాదు ఆ శరీరంలో కాలానుగుణంగా వచ్చే ఆరోగ్యమార్పులను అర్ధం చేసుకోవటం.. భర్త అంటే పిల్లలను కని ఇవ్వటమే కాదు ఆ పిల్లల పట్ల కనీసావసరాలను గుర్తేరగటం.. భర్త అంటే భార్య పట్ల చిరు కోపాన్ని ప్రదర్శించటమే కాదు భార్య చిన్ని చిన్ని కోరికలను తీర్చటం... భర్త అంటే భరణం తీసుకోవటం ఎంత మాత్రం కానే కాదు తన బలానికి భార్య బలం జోడించటం....

సమాజంలో కొన్ని విలువైన అనుబంధాలకు విలువ లేకుండా పోతుంది. మనకే కాదు ఎదుటి వాళ్ళకి ఓ మనసుందని మరిచి చెదిరిపోతున్నాయి మానవసంబంధాలు. ప్రేమలు లేవు లేవు ఆప్యాయతలు అంతకన్నా లేవు కాసుల వేటలో కరిగిపోతుంది కాలం ఓ కలలా..... కార్పోరేటు తీరు కుటుంబ వ్యవస్థలో, ఇంట్లో అందరూ ఉన్నా ఎవరికి వారు ఒంటరే..... భర్త ఇంటికి వచ్చ్హేవరకు తెలియదు భార్య ఇంట్లోనే ఉందని.., భర్త వస్తాడో రాదు తెలియదు భార్యకి..... అత్యవసరాలకి తప్ప ఆప్యాయంగా మాట్లాడుకోవటం మరిచారు నేటి కాలంలో...., ప్రేమైనా, కోపమైనా, ఆవేశమోచ్చినా, ఏ ఆలోచనొచ్చినా ఎదోచ్చినా సోషల్ మీడియా అనే వేదిక సృష్టించుకొని మరి పంచుకుంటున్నారు. లేకుంటే ఉందిగా అద్భుతమైన హాస్తాభరణం, క్షణాల్లో ప్రపంచాన్ని కళ్ళముందుంచే చరవాణి.... దానితోనే సహజీవనం చేస్తున్నాం. ఇంట్లో మన కోసం ఒకరున్నారని మరుస్తూ 'సహజీవనం' తో శాశ్వతంగా ముడివేసుకుంటున్నాము. మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి అలవాటు పడటం తప్పేమీ కాకపోవచ్చు.., కాని సాంకేతిక పరిజ్ఞానాన్ని తనువు నిండా తగిలించుకొని సామాజిక సంబంధాలను విచ్చిన్నం చేస్తున్నాడు.

మన ముందు తరాల వారు ఎన్ని సందేహలోచ్చిన, ఎన్ని సమస్యలోచ్చినా, ఎంత కోపమొచ్చిన కానీ వందేళ్ళు కష్ట సుఖాలని తమవిద్దరివే అనుకున్నారు... కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. ఎన్ని అవాంతరాలు వచ్చిన.., ఎన్ని అవరోధాలు ఏర్పడినా అవన్నీ వారికి అడ్డు కాలేదు.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మనకు వెలకట్టలేని ఆలు మగల బంధం గూర్చి భవిష్యత్ తరాలకు నేర్పినటువంటి అటువంటి ఎందఱో మహా దంపతులకు శతకోటి వందానిభివందనాలు.... మన పూర్వపు తరాల స్పూర్తిగా.....

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles