Air asia flight found in sea official statement has given some dead bodies also collected

airasia flight found in sea, singapore flights, indonesia flight incident, malaysia flight incidents, indonesia to sinagpore flight, disappeared flight found in sea, java ocean, java sea, flight in java sea, air asia flight found in ocean, flight passengers dead bodies found in sea

A day after it disappeared en route from east Java in Indonesia to Singapore, mystery surrounds the fate of AirAsia flight QZ8501 and the 162 people on board that flight found in sea

ITEMVIDEOS: ఉత్కంట వీడింది.... విషాదం మిగిలింది

Posted: 12/30/2014 03:14 PM IST
Air asia flight found in sea official statement has given some dead bodies also collected

గత మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమాన సంఘటన విషాదాంతంతో ముగిసింది. సముద్ర ఉపరితలంపై కొన్ని శకలాలు కనిపించిన కొద్ది సేపటికే ఎయిర్ ఏషియా విమానం కూలిపోయినట్లు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా అధికారులు తెలిపారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. ఈ విషయం తెలియగానే ప్రయాణికుల బంధువుల ఆశల సౌధాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. తమ వారు ఎక్కడో చోట క్షేమంగానే ఉంటారని, తిరిగోస్తారని ఎదురుచూసిన ప్రయాణికుల బంధువులకు తీరని ఆవేదనను మిగిల్చింది.

విమానం రాడార్ పరిధినుంచి తప్పిపోయిన ప్రాంతానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను తొలుత గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయగా కొన్ని మృతదేహాలు కూడా కనిపించాయి. దాంతో విమానం సముద్రంలోనే కూలిపోయిందని స్పష్టంగా తెలిసింది. ఇక ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది. ఇంకా అక్కడ ఆ ప్రాంతం లో గాలింపు చర్యలు మమరం చేశారు. ఆ విమానం సముద్ర గర్భానికి వెళ్ళిపోయిందా లేదా కొందరు ప్రయాణికులు విమానంలో నుండి దూకార అన్నది నిర్దారణ కావాల్సి ఉంది. ఒకవేళ విమానం సముద్ర గర్భంలోకి మునిగిపోయి ఉంటె ఆ విమానాన్ని తీసే సాంకేతిక పరిజ్ఞానం కానీ, సామగ్రి కానీ ఇండోనేషియా దగ్గర లేదు. మళ్ళి అమెరికా సహాయాన్ని అది పొందాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రాంతం లోనే విమానం మునిగిందా లేదా అన్నది ఇంకా నిర్దారణ కావాల్సి ఉంది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : java sea  airasia flight found  dead bodies  

Other Articles