What happened to airasia flight that went missing

airasia flight, singapore flights, indonesia flight incident, malaysia flight incidents, indonesia to sinagpore flight, disappeared flight, java ocean, java sea, flight in java sea

A day after it disappeared en route from east Java in Indonesia to Singapore, mystery surrounds the fate of AirAsia flight QZ8501 and the 162 people on board

ఆ విమానం జల సమాధే అయ్యిందా!! ఇంకా కొనసాగుతున్న అన్వేషణ

Posted: 12/30/2014 10:34 AM IST
What happened to airasia flight that went missing

గల్లంతైన ఎయిర్ ఏషియా విమానం కోసం మూడో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలిపోయినట్లుగా అనుమానిస్తున్న జావా సముద్రం లో ౩౦ నౌకలు, 15 విమానాలతో గాలింపు చర్యలు చేపట్టారు. 16౨ మందితో మందితో బయలుదేరిన అ విమానం ఆదివారం అదృశ్యమైన విషయం మనకందరికీ తెలిసిందే. గాలింపు చర్యల్లో ఇండోనేషియా, మలేషియా, ఆస్త్రిలియా, దక్షిణ కొరియా పాల్గొంటున్నాయి.

విమానం సంబంధాలు కోల్పోయిన చోటుకు 1120 కి.మీ ల దూరం లో ఉన్న సెంట్రల్ కాలిమంత్రాన్ సమీపం లో కొన్ని శకలాలను గుర్తించినట్లు కొందరు ప్రకటించిన అధికారులు మాత్రం ఇంకా దృవికరించటం లేదు. కాని జావా సముద్రం లో రెండు చోట్ల మాత్రం చమురు తేలియాడుతున్నట్లు గుర్తించారు. కాని అది ఆ విమానానికి సంబంధించినదేనా లేదా ఇంకా వేరేదా అన్నది దృవికరించుకోవాలి.

తీవ్ర ప్రతికూల వాతావరణం లో చిక్కుకున్న విమానాన్ని ఎడమ వైపు నడిపి, 32 వేల అడుగుల నుండి 38 వేల అడుగులకు పెంచుకోవచ్చా అని ఆ విమాన పైలట్లు కోరినా గగనతల నియత్రణ వ్యవస్థ నుంచి వెంటనే అనుమతి రాకపోవటానికి కారణం ఆ సమయంలో ఇతర విమానాలు ఆ ఎత్తులో  ప్రయానణిస్తుండటమే ఎ.టి.సి వర్గాలు చెప్తున్నాయి. కాని ఎంత ప్రతికూల పరిస్థితుల్లో అయిన ఆ విమానానికి అద్భుతంగా పనిచేయగల సమాచార వ్యవస్థ ఉందని అలాంటిది ఆ విమానం అదృష్యం కావటం అనేది అంతు చిక్కని రహస్యంగానే ఉందని కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రతికూల వాతావరణానికి తోడు ఇంకా కొన్ని కారణాలు జత అవ్వటం వల్లనే ఏదైనా ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : java sea  airasia flight  malaysia  

Other Articles