Subramanian swamy comments on muslims and ravana

Subramanian Swamy, Subramanian Swamy latest, Subramanian Swamy on ravana, Subramanian Swamy on Muslims, Subramanian Swamy on Hindus, Subramanian Swamy latest comments, Subramanian Swamy on black money, Subramanian Swamy latest comments, ayodhya issue

Subramanian Swamy comments on Muslims and Ravana : Bjp Leader Subramanian Swamy says all people in India are Hindus, Even Muslims also belongs to Hindu. Lord ravana and his wife mandodari belongs to uttarpradesh both are sc cast people of the state says Subramanian Swamy

దేశంలోని ముస్లింలూ హిందువులే

Posted: 12/28/2014 03:54 PM IST
Subramanian swamy comments on muslims and ravana

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి సంచలన కామెంట్లు చేశారు. తరుచుగా విపక్షాలపై విరుచుకుపడే ఈయన.., దేశంలోని ప్రజలంతా హిందువులే అన్నారు. అంతేకాదు భారత్ లో ఉన్న ముస్లింలు కూడా హిందువులే అని చెప్పారు. ఈ విషయం వారికి కూడా తెలుసని కామెంట్ చేశారు. ప్రజలందరికి డీఎన్ఏ పరీక్షలు చేస్తే అందరూ హిందువులే అన్న విషయం తెలుస్తుందన్నారు. యూపీలో జరిగిన ‘ఐ అండ్ మై ఇండియా’ కార్యక్రమంలో ఈ కామెంట్లు చేశారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.., రావణుడు శ్రీలంకకు చెందినవాడని ఇన్నాళ్ళుగా అందరూ అనుకుంటున్నారు. అయితే సుబ్రహ్మణ్యస్వామి కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. రావణుడు, అతని భార్య మండోదరి ఇద్దరూ ఉత్తరప్రదేశ్ కు చెందిన దళితులు అన్నారు. రావణుడు ఘజియాబాద్ దగ్గర ఉండే బస్రఖ్ ప్రాంతంలో జన్మించగా మండోదరి మీరట్ ప్రాంతానికి చెందినదిగా చెప్పారు. కాలక్రమంలో శివుడి ఆశీస్సులతో రావణుడు లంకను హస్తగతం చేసుకున్నాడని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. ఇన్నాళ్ళు రావణుడిది మన దేశమే కాదనీ.., ఈయనతో యుద్ధం చేసేందుకు రాముడు సేతు సముద్రం నిర్మించాడని ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  Ravana mandodari  Hindus  

Other Articles