Air asia flight missing

Air Asia Flight missing, Air Asia Flight crash, Air Asia Flight disappeared, Air Asia Flight crash latest, Air Asia Flight crash photos, Air Asia Flight missing latest, Air Asia Flight Indonesia to Singapore missing, Indonesia on Air Asia Flight missing, Singapore on Air Asia Flight missing, flight crashes in the world, mysterious flight accidents, funny flight accidents, world latest updates

Air Asia Flight Missing : Air Asia Flight travelling Indonesia to Singapore missing lost contat with air traffic control center. QZ8501 flight from Surabaya of Indonesia to Singapore lost contact and authorities announced missing. Indonesia and Singapore governments searching for Air Asia Missing Flight having 162 passengers

ఈ విమానం తప్పిపోయింది... కూలిపోయినట్లు అనుమానం?

Posted: 12/28/2014 10:36 AM IST
Air asia flight missing

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏసియాకు చెందిన ఒక విమానం అదృశ్యమైంది. ఇండోనేషియాలోని సురబాయా పట్టణం నుంచి సింగపూర్ కు బయల్దేరిన ఈ విమానం కొద్ది సమయం పాటు ట్రాఫిక్ కంట్రోల్ రూంతో సంబంధాలు కొనసాగించింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ట్రాఫిక్ కంట్రోల్ బేస్ తో సంబంధాలు తెగిపోయాయి. సమీపంలోని ఏ విమానాశ్రయాల బేస్ కంట్రోల్ రూంలు ఈ విమానం సిగ్నల్ ను గుర్తించలేకపోతున్నాయి. ఉదయం 8.30కే సింగపూర్ రావాల్సి ఉండగా సరిగ్గా గంట ముందుగా సంబంధాలు కట్ అయ్యాయి. దీంతో విమానం తప్పిపోయిందని ఎయిర్ ఏసియా ప్రకటించింది.

తప్పిపోయిన విమానం నంబర్ QZ8501. ఇందులో సిబ్బంది సహా 162మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా 149మంది ఇండోనేషియన్లు ఉన్నారు. ముగ్గురు కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియా ప్రయాణీకులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అత్యధికులు ఇండోనేషియా ప్రయాణీకులు ఉండటంతో ఆ దేశ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. విమానం వెతికేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. సమీప దీవులకు చెందిన దేశాలకు కూడా సముద్ర జలాల్లో వెతుకులాట ప్రారంభించాలని కోరింది.

విషాదం తప్పదా..?

ఈ మద్య తప్పిపోయిన మలేషియన్ విమానాలు ప్రమాదానికి గురి కావటంతో ఈ విమానం కూడా ప్రమాదానికి గురయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిజమయితే ఈ ఏడాది చివర్లో మరో విషాదం నెలకొన్నట్లు అవుతుంది. తాజా విమాన అదృశ్యంతో ఎయిర్ ఏసియా ఇతర సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకునే వారి సంఖ్య కాస్త తగ్గింది. అయితే విమానం ప్రమాదానికి గురయినట్లు ఇప్పడు చెప్పలేమనీ.., ప్రయాణీకుల సంబంధీకులు దిగులు చెందవద్దని ఎయిర్ ఏసియా చెప్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air Asia Flight missing  Flight accidents  World latest news  

Other Articles