India asks pakistan to hand over dawood ibrahim

dawood ibrahim, dawood ibrahim arrest, dawood ibrahim found, dawood ibrahim in pakistan, dawood ibrahim mafia, dawood ibrahim world, dawood ibrahim illegal activities, dawood ibrahim house in india, dawood ibrahim in dubai, india on dawood ibrahim, intelligence on dawood ibrahim, pakistan saves terrorists, india on pakistan, india latest updates

india asks pakistan to hand over dawood ibrahim : indian government asked pakistan on saturday to handover underworld mafia don dawood. western intelligence found dawood in pakistan near karachi. narendra modi government serious about mafia and terrorism

మిస్టర్ క్లీన్ అన్పించుకునేందుకు కేంద్రం ప్రయత్నం

Posted: 12/28/2014 07:48 AM IST
India asks pakistan to hand over dawood ibrahim

ఉగ్రవాదంపై గత ప్రభుత్వం సరిగా స్పందించటం లేదని ఎన్నికల సమయంలో నరేంద్రమోడి ప్రచారం చేశారు. దేశంలో ఉగ్రవాద దాడులు పెరుగుతున్నా.., యూపీఏ పట్టించుకోవటం లేదన్నారు. అయితే మోడి అధికారంలోకి వచ్చాక.., ఈ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల సదస్సుల్లో ప్రసంగిస్తున్నారు తప్ప, దేశంలో పెద్దగా చేసిందేమి లేదు. తాజాగా అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అంశం తెరపైకి వచ్చింది. దావూద్ పాక్ లోనే ఉన్నాడని అంతేకాకుండా.., భారత్ కూడా గతంలో పట్టుకునేందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిందని ఓ విదేశీ నిఘా సంస్థ వెల్లడించింది.

ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిందని స్పష్టం అవుతోంది. యూపీఏ పై విమర్శలు చేసిన బీజేపీ.., తన ప్రభుత్వం మిస్టర్ క్లీన్, ఉగ్రవాదులను అణిచివేస్తుందని చెప్పుకునేందుకు వెంటనే రంగంలోకి దిగింది. దావూద్ ను అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పాక్ ను కోరాడు. దావూద్ కరాచీలో ఉన్నట్లు ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ ఆధారాలను కూడా పాక్ కు పంపామని చెప్పారు.

మోడి సర్కారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాగానే పనిచేస్తుందని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. అయితే సరిగ్గా నిఘా సంస్థ వివరాలు వెల్లడించిన తర్వాతే ఎందుకు స్పందించారు? ఆధారాలు ఉంటే మాఫియా ఢాన్ ను అప్పగించాలని పాక్ ను ముందే కోరవచ్చు కదా అని అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై చర్చ జరుగుతుంది కాబట్టి.., ప్రభుత్వం మిస్టర్ క్లీన్ అన్పించుకునేందుకు ప్రకటన చేశారని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రచారం కోసం వాడుకోవటం అంటే ఇదేనేమో. అయితే అదృష్టవశాత్తు మోడి సర్కారు వచ్చాక దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయి. ఇది ఎన్డీయే గొప్పతనమా.., లేక తీవ్రవాదులు అదునుకోసం ఎదురుచూస్తున్నారా తెలియదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dawood ibrahim  pakistan terrorism  indian intelligence  

Other Articles