Big b meets kcr

amitabh bachchan news, amitabh kcr news, kcr news, kcr latest news, amitabh bachchan kcr latest news, amitabh bachchan met kcr, kcr house, cm kcr family members, akkineni nagarjuna news, nagarjuna latest news, nagarjuna kcr news, nagarjuna kcr house, anr award, amitabh bachhan anr award, kcr anr award, amitabh kcr nagarjuna

Bollywood Mega Star-Big B Amitabh Bachchan on Saturday met Telangana Chief Minister K. Chandrasekhar Rao at CM Camp Office in Begumpet.

కేసీఆర్ తో బిగ్ బి అబితాబ్ భేటీ

Posted: 12/27/2014 08:48 PM IST
Big b meets kcr

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చినందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. అక్కినేని జాతీయ పురస్కారం అందుకునేందుకు హైదరాబాద్ వచ్చిన అమితాబ్.. సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న అమితాబ్.. కేసీఆర్ సహా పలువురు నేతలు, కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు.  అమితాబ్ దివంగత మహానటుడు ఏఎన్ఆర్ ఫౌండేషన్ అవార్డును స్వీకరించేందుకు హైదరాబాద్ రావడంతో ఈ అపరూప కలయిక అవిష్కృతం అయ్యింది.

ఈ సందర్భంగా అమితాబ్..  కేసీఆర్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర సాధన క్రమాన్ని, హైదరాబాద్ చరిత్రను అమితాబ్‌కు కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ హైదరాబాద్ అద్భుత నగరమని కితాబిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అమితాబ్ బచ్చన్ కేసీఆర్‌కు హామీ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ తో టాలీవుడ్ నటుడు, ఏఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అక్కినేని నాగార్జునతో పాటు పలువురు కేసీఆర్ తో బేటీ అయ్యారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  kcr news  ANR award  Akkineni Nagarjuna news  

Other Articles