Telangana proposes changes to hyderabad metro rail alignment issue goes pm modi

kcr rules on metro, kcr decissions on hyderabad mero rail, telangana government decissions on metro rail, hyderabad metro rail issue, hyderabad metro rail issue goes to pm modi, pm modi concentrate on hyderabad metro rail, nvs reddy metro md, L and T metro project

The Telangana government has proposed three changes in the alignment of the Hyderabad Metro rail project, it was officially announced

అటు పోయి ఇటు పోయి చివరకి మోడీ దగ్గరకి వివాదం..!

Posted: 12/27/2014 11:35 AM IST
Telangana proposes changes to hyderabad metro rail alignment issue goes pm modi

ఇప్పటికే మెట్రో రూట్ పై అటు ప్రభుత్వం లో ఇటు ఎల్ & టి సంస్థ లోనూ తీవ్ర తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మెట్రో రూట్ మార్పు జరగకుండా, యదావిధిగా పనులు పూర్తి అయ్యేందుకు గాను నిర్మాణ సంస్థ ఎల్.అండ్ టి చేసిన ప్రయత్నం విపలం అయింది. ఇప్పటికే నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతున్నాయి, ఇంకా మళ్ళి మెట్రో రూట్ లో మార్పు అంటే మరింత జాప్యం కావటమే అన్న ఎల్ & టి సంస్థ ప్రతినిధుల మాటలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకిభవించటం లేదు. ఇప్పటికే చాలా సార్లు ప్రయతించిన ఎల్ & టి సంస్థ ప్రతినిధులు ఆ ప్రయత్నాలు చేసి చేసి ఇంకా పాలుపోలేక ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకే ఆ రూట్ మార్పును అనుసరించాలని నిర్ణయించుకుంది.

కాని ఇటీవల ఎల్ & టి సంస్థ ప్రతినిధులు మళ్ళి తాజాగా తన గోడు ముఖ్యమంత్రి దగ్గర వేల్లబోసుకుంది. ఇటీవల ఐఏఎస్ ఆఫీసర్ అయిన షీలా బిడే కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసినప్పుడు ఈ మెట్రో అంశం ప్రస్తావనకు వచ్చింది. షీలా బిడే ప్రభుత్వరంగ సంస్థల విభజన కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఆమె కెసిఆర్ ను కలిశారు.అప్పుడే ఆమె మెట్రో రైలు రూట్ మార్పు గురించి కూడా మాట్లాడారు. రూట్ మార్పు వల్ల వ్యయం పెరగడంతో పాటు, కాలహరణ జరుగుతుందని ఆమె ముఖ్యమంత్రి తో అన్నట్లు తెలుస్తుంది. కాని దీనికి కెసిఆర్ ససేమిరా అనటంతో ఆమె ఏమి మాట్లాడకుండా తిరిగొచ్చేసినట్లు సమాచారం. దీనితో మళ్ళి ఈ వివాదం మొదటికి వచ్చినట్లయింది.


హైదరాబాద్ మెట్రో రైల్ రూట్ విషయం ఎల్ & టి ప్రతినిధులకు తీవ్ర ఆందోళనను రేకేత్తిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ముందు ప్రదిపాదించిన ఈ రూట్ మారినట్లయితే ప్రభుత్వానికే కాకా, ఎల్ & టి సంస్థ కు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు ఎప్పటినుండో తెలంగాణ ప్రభుత్వానికి నివేదిస్తూ వచ్చారు. కాని తెలంగాణా ప్రభుత్వం దీనికి వారసత్వ సంపద ఆనవాళ్ళు లేకుండా అవుతుందని ససేమిరా అనటంతో ఎల్ & టి సంస్థ తీవ్ర చిక్కుల్లో పడింది.

కాని ఇప్పుడు మళ్ళి ఎల్.అండ్ టి సంస్థ దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రదాని నరేంద్ర మోడీని మరోసారి జోక్యం చేసుకోవాలని కోరే అవకాశం ఉందని అంటున్నారు. అసెంబ్లీ ఎదుట,పాతబస్తీలోను, సుల్తాన్ బజార్ వద్ద మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కాని ఇప్పటికే ఆయా చోట్ల పిల్లర్ల నిర్మాణం కూడా జరిగిపోయింది. దీనివల్ల ఇప్పుడు మార్చు చేస్తే వందల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఎల్.అండ్ టి చెబుతోంది. అయితే మార్పులపై ప్రభుత్వం చేసిన సూచనలను ఎల్.అండ్ టి అద్యయనం చేస్తోందని ప్రభుత్వం తరపున ఎన్.వి.ఎస్.రెడ్డి చెబుతుంటే, తమకు ఎలాంటి మార్పు ప్రతిపాదనలు రాలేదని, దీనిపై అద్యయనం చేస్తామని ఎల్ అండ్ టి సంస్థ అదికారి గాడ్గిల్ అంటున్నారు. గత ఆరునెలలుగా రాజకీయాలు తప్ప,దీనిపై ఏమీ జరగలేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనిపై గట్టిగా పట్టుబడితే మళ్లీ గతంలో జోక్యం చేసుకున్నట్లుగా కేంద్రాన్ని జోక్యం చేసుకోవాలని ఎల్ అండ్ టి కోరవచ్చుని అంటున్నారు. ఏది ఏమైనా ఎల్.అండ్ టి మెట్రి వివాదం చివరకి ప్రధానిని చేరేల కనిపిస్తుంది. మరి ఈ మెట్రో వివాదం పై ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..!

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : L and T metro project  KCR decission on metro  pm narendra modi  

Other Articles