Nayani apologizes to rosaiah

Telangana Home Minister Nayani Narsimha Reddy, nayani says sorry to roshaiah, nayani apology to roshaiah, nayani apologizes to Rosaiah, Nayani apologizes to Rosaiah on land issue, Nayani apologizes to Rosaiah on his son in law's land issue, Nayani apologizes for his remarks, Nayani apologizes to Rosaiah on mallepally land issue, Nayani sorry for his statements

Home Minister Nayani Narsimha Reddy today withdrew his remarks made against Tamil Nadu Governor K Roshaiah’s son-in-law on land issue.

నోరుజారి.. నాలుక కరుచుకున్నాడు.. తప్పుంటూ క్షమాపణలు చెప్పాడు

Posted: 12/26/2014 07:52 PM IST
Nayani apologizes to rosaiah

అన్నింటా అవేశపడి ముందుకు దూసుకువెళ్లే నైజం వున్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి.. ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మల్లెపల్లి ఐటీఐలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యాలు క్షమాపణల వరకు తీసుకెళ్లాలి. ముందు అనవసరంగా నోరు జారిన నాయిని.. ఆ తరువాత తాను తప్పడు వ్యాఖ్యాలు చేశానని నాలుక కరుచుకున్నారు. అంతే కాదా.. తాను చేసిన తప్పును అంగీకరిస్తూనే ఏ మాత్రం అహంకారానికి వెళ్లకుండా తప్పు చేశానని, అందుకు క్షపాపణలు చెప్పుకున్నాడు.

తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి క్షమాపణలు కోరారు. రోశయ్య అల్లుడి విషయంలో చేసిన ఆరోపణలపై ఆయన క్షమాపణ చెప్పారు. మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)కు చెందిన భూమిని అక్రమంగా రోశయ్య అల్లుడికి కేటాయించారని తాను ఆరోపణలు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయంలో రోశయ్య తనకు ఫోన్ చేశారని చెప్పారు. ఈ అంశంలో రోశయ్య అల్లుడికి సంబంధం లేదని విచారణలో తేలిందని చెప్పారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమి వెనక్కు తీసుకుంటామని చెప్పారు.

కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అల్లుడికి చెందిన నియోనాటల్ ఇన్‌టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్(నైస్) ఆస్పత్రికి అప్పనంగా ఎకరా స్థలాన్ని కట్టబెట్టారని నాయిని అంతకుముందు ఆరోపించారు. అయితే ఉద్యమ పార్టీ నేతగానే తనను తాను అభివర్ణించుకుంటున్న నాయిని నరసింహారెడ్డి.. రాష్ట్ర మంత్రిగా వున్నారు. ఈ స్థాయిలో వుండి తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని, అమాత్యులు తిందరపడి మాట్లాడటం, ఆ తరువాత క్షమాఫణు చెప్పడం రెండూ సహేతుకం కావని అంటున్నారు. కాగా పొరబాటు చేసినా.. క్షమాపణలు అడిగే ధైర్యం వుండాలని అది తమ నేతలో పుష్కలంగా వుందని మరికొందరు నేతలు నాయిని విషయంలో చర్చించుకుంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayani Narsimha Reddy  Roshaiah  apology  

Other Articles