Rajinikanth assets to be auctioned for failing to repay bank loan

rajnikanth, rajnikanth latest news, rajnikanth assets news, rajnikanth movies, rajnikanth photos, rajnikanth latest movie news, rajnikanth movie collections, rajnikanth bank loan, rajnikanth debts, rajnikanth Exim bank loan, Exim bank autions rajnikanth assets, rajnikanth assets latest news

superstar Rajnikanth's property are for auction. With the star allegedly failed to repay his loan, Exim bank has decided to auction his property.

ITEMVIDEOS: రజనీకాంత్ ఆస్తులను వేలం వేస్తున్నాం.. కొంటారా..?

Posted: 12/26/2014 03:42 PM IST
Rajinikanth assets to be auctioned for failing to repay bank loan

భారతీయ సినీజగత్తులో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను పదిలపరుచుకున్న ‘సూపర్’స్టార్ రజనీకాంత్ ను కష్టాలు చుట్టుముట్టాయా..? అంటే అవుననే సందేహమే వస్తుంది. దక్షిణాది సినీ పరిశ్రమలో రారాజుగా ఎదిగిన రజనీకాంత్ ఆస్తులు వేలానికి సిద్దంగా వున్నాయన్న ప్రకటన.. దక్షిణాదిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెంబర్ వన్ స్థానంలో కోనసాగుతున్న రజనీకాంత్.. అప్పుల పాలు అయ్యాడన్న విషయాన్ని సినీ పరిశ్రమ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇంతకు ఎం జరిగింది. రజనీకాంత్ వంటి సెలబ్రిటీకి ఎందుకింత కష్టం వచ్చిందన్న చర్చలు ప్రారంభమయ్యాయి.

కొచ్చాడియన్ సినిమా కోసం తాను నిర్మాతకు ఇచ్చిన ష్యూరిటీ ఇప్పుడు ఆస్తుల వేలానికి కారణమవుతోందని సమాచారం. కోచ్చాడియన్ సినిమాకు సునంద మురళీ మనోహర్, సునిల్ లుల్లాలు నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే సిసిమాకు తెర వెనుక నుండి నిర్మాత బాధ్యతలను కూడా కొంత వరకు రజనీ కాంత్ తనయ, చిత్ర దర్శకురాలు ఐశ్వర్య చూసుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా అధికం కావడంలో.. రజనీకాంత్ తన ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు సుమారు 20 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. వడ్డీతో కలిపి ఇప్పడు అది 22 కోట్ల, 21 లక్షలు 85 వేల రూపాయల పైచిలుకు డబ్బులు తీసుకున్నారని.. వాటితో ఎలాగోలా సినిమాను విడుదల చేశారని సమాచారం.

ఇంతవరకు బాగానే వున్నా రజనీకాంత్ హీరోగా రూపొందించినా 125 కోట్ల రూపాయాల భారీ బడ్జెట్ కార్టూన్ చిత్రానికి ప్రేక్షలకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మరోలా చెప్పాలంటే మనవారికి ఇలాంటి సినిమాలు అసలు ఇష్టమే లేదు. దీంతో సినిమా కాస్తా బాక్సిఫీసు వద్ద ఫ్లాప్ కావడం, నిర్మాతలు భారీ నష్టాలను చవిచూశారు. ఈ క్రమంతో వారు రజనీకాంత్ కు డబ్బులను చెల్లించే స్థాయిలో కూడా లేరు. సినిమాతో వారు మూటగట్టుకున్న భారీ నష్టాలు నేపథ్యంలో వారిని రజనీకాంత్ కూడా డబ్బులు చెల్లించమని అడగలేదు. తన పాట్లేవో తాను పడతానని చెప్పాడు రజనీకాంత్.

అయితే ఎవరు అడిగినా, అగడకపోయినా.. బ్యాంకు వారు మాత్రం అడగకుండా ఎలా వుంటారు. అడిగారు. లింగా చిత్రంలో బిజీగా వున్న రజనీకాంత్ కు బ్యాంకు అధికారుల ఫోన్ సమాచారాన్ని అందించడంలో అతని సబ్బంది అశ్రద్ద చేశారు. అంతే రుణమిచ్చిన ఎగ్జిమ్ బ్యాంకు ఏకంగా రజనీకాంత్ కు చెందిన అస్తులను వేలం వేయడానికి సిద్దమైంది. ఈ మేరకు ప్రముఖ ధినపత్రికల్లో ప్రచురించింది. రజనీకాంత్ ఆస్తులను వేలం వేస్తున్నాం.. కొంటారా అన్న ప్రకటన చూసి కాలీవుడ్ షాక్ కు గురైంది. ఇది చూసిన రజనీకాంత్ అభిమానులు తమ సూపర్ స్టార్ కు ఎంత కష్టం వచ్చిందని అవేదన చెందుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  exim bank  Assets auction  paper statement  repay bank loan  

Other Articles