Bharat ratna for atal bihari vajpayee madan mohan malaviya

Bharat Ratna for atal bihari vajpayee, and madan mohan malavya, Bharat Ratna awardee list, Bharat Ratna recent awardees, alal bihari vajpayee awarded Bharat Ratna, madan mohan malavya special story, atal bihari vajpayee special story

Country's highest honour to these illustrious stalwarts is a fitting recognition of their service to the nation.

అగ్ర నేతకు, అపూర్వ నేతకు అభినందన మందార మాల

Posted: 12/26/2014 10:39 AM IST
Bharat ratna for atal bihari vajpayee madan mohan malaviya

అణు పరీక్షలకైన, ఆర్ధిక రంగ సంస్కరణలకైన ఒక నూతన ఒరవడిని సృష్టించటం నుండి.., రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం తెర లేపటం వరకు.., ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రాజకీయ భీష్మ పితామహుడు.., ఆజన్మ బ్రహ్మచారి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారికి అత్యున్నత పురస్కారం అయిన "భారత రత్న" ప్రకటించటం నిజంగా భారతీయులందరికీ గర్వ కారణం... ప్రపంచమంతా అణ్వాయుధాలు కలిగి ఉండి, మన భారత్ ఎటువంటి ఆయుధాలను నమ్ముకోలేక తన సొంత శక్తి పై ఆధార పడి ఉన్న దశలో భారత సైన్యానికి ఒక గొప్ప శక్తి ని ప్రసాదించే విధంగా, వారిలో ఆత్మ విశ్వాసం నింపేలా..., ఒక గొప్ప శాస్త్ర వేత్త ఆధ్వర్యం లో అణు పరిక్షలు నిర్వహించి శాంతి కాముక దేశమైన మన దగ్గర కూడా ఎవరినైనా ఎదుర్కొనే సత్తా ఉందని.., మన శత్రు దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు పంపి వాళ్ళలో ముచ్చెమటలు పట్టేలా చేసిన యోధుడు శ్రీ వాజ్ పేయ్. అలాంటి వ్యక్తికి  ఈ రోజు మనం అత్యున్నత పురస్కారంతో సత్కరించుకోవటం నిజంగా మనదరికి గర్వకారణమే..   అందుకే ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీ లన్ని ఆయనకు ఈ పురస్కారం ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

త్యాగాలకు మారుపేరై నిలిచి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.., మనకు స్వేత్చ ను ప్రసాదించటానికి తన స్వేత్చను కోల్పోయి ఎన్నో ఆటుపోట్లను అవలీలగా ఎదుర్కొని తన దేశం కోసం, తన భావి తరాల భవిష్యత్ కోసం తెల్ల దొరలపై పోరాడి బానిస సంకెళ్ళ నుండి విముక్తి కల్పించి.. మనకు స్వతంత్రం సంపాదించి పెట్టిన మదన్ మోహన్ మాలవ్యకు ఈ రోజు అత్యున్నత పురస్కారం ఇవ్వటం మన దేశాన్ని మనం సత్కరించుకున్నట్లే అవుతుందేమో. దేశం కోసం వారి త్యాగాలు అనుపమనీయం. అలాంటి వారిద్దరికీ ఈ రోజు "భారత రత్న" అనే పురస్కారం ద్వారా సత్కరించుకోవటం దేశానికే అద్వితీయమైన, అరుదైన రోజు. ఆ మహానీయులిద్దరికి తెలుగు విశేష్ హృదయపూర్వక అభినందనల మందార మాల....!!

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bharat Ratna  atal bihari vajpayee  madan mohan malavya  

Other Articles