Diesel petrol prices likely to be cut down

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

Diesel & petrol prices likely to be cut down as crude oil pices decreased to 55 american dollars

తగ్గిన క్రూడ్ అయిల్ ధర.. తగ్గనున్న ఇంధన ధరలు

Posted: 12/25/2014 03:40 PM IST
Diesel petrol prices likely to be cut down

గతంలో పెరగడమే తప్ప తరగడం తెలియక పైపైకి ఎగబాకిన చమురు ధరలు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో కిందకు దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు మరింత తగ్గడంతో పెట్రోల్ ధరలు మరింతగా తగ్గనున్నాయి. అమెరికా మార్కటింగ్ చేసే క్రూడ్ ఆయిల్ ధరల బ్యారల్ కు 55 డాలర్లకు చేరుకుంది. దీంతో మన దేశంలో కూడా మరోమారు పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. క్రిస్టమస్ సంబరాలకు తోడు పన్ను రాయతీల కోసం పెద్ద ఎత్తున అమ్మాకానికి వున్న క్రూడ్ అయిల్ స్టాక్..  ధరలు తగ్గడానికి కారణంగా మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. 60 డాలర్ల వద్దనున్న బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర.. ఏకంగా నాలుగు డాలర్లు తగ్గి 55 డాలర్లకు చేరుకుంది.

గతంలో 110 పై చిలుకు అమెరికన్ డాలర్లు పలికిన క్రూడ్ అయిల్ ధర ప్రస్తుతం సగానికి చేరుకుంది. అయితే క్రూడ్ అయిల్ ధర అత్యధిక స్థాయికి చేరిన సందర్భంలో.. హైదరాబాద్ లో సుమారు ఎనభై రూపాయల వరకు పలికిన పెట్రోల్ దర.. ఇప్పు గణనీయంగా తగ్గనుంది. అయితే క్రూడ్ అయిల్ తగ్గింపు ధరలతో పోల్చుకుంటే.. పెట్రోల్, డిజిల్ ధరలు ఆశించిన మేరకు తగ్గడం లేదు. ఇంధన ధరల నియంత్రణపై కేంద్రం చేతులెత్తిసిన నాలుగేళ్లు కావస్తున్న తరుణంలో ఈ పరిణామాం శుభసూచకమే అయినా.. క్రూడ్ అయిలో ధరల తగ్గింపులో వున్న తగగింపు మాత్రం మనకు ఇందన దరల్లో కనబడటం లేదు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  

Other Articles