Union minister touched by the carnage

Union Home Minister Rajnath singh, Home Minister Rajnath singh visits assam, Rajnath singh visits assam, Rajnath singh visits assam following violence, Rajnath singh visits violence hit assam, Rajnath singh touched by carnage, high alert in assam, high alert in guwahati,

Union Home Minister Rajnath visits Guwahati, high alert sounded in Assam after Bodo militant attack kills 68 people

మారణహోమాన్ని చూసి చలించిన కేంద్రమంత్రి

Posted: 12/24/2014 10:40 PM IST
Union minister touched by the carnage

బోడో ఉగ్రవాదులు.. ఆదివాసీల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న అసోం రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లారు. మూడు జిల్లాల్లో 65 మంది ఆదివాసీలను బోడో ఉగ్రవాదులు హతమార్చన ఘటనలను చూసి ఆయన చలించిపోయారు. బోడో ఉగ్రవాదుల ఘాతుకంతో ఊగిపోతూ ప్రతిదాడులకు సిద్దమైన ఆదివాసీలు బోడోల గ్రామాలను తగలబెట్టిన ఘటనలను ఆయన పరిశీలించారు. ఉగ్రవాదుల మారణహోమంలో తమ భార్య పిల్లలను కోల్పోయిన ఆదివాసీయులు ఆందోళనలతో రగలిపోతూ హింసాత్మక ఘటనలకు పాల్పడిన ఘటనలపై ఆయన పోలీసు నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు గిరిజనులు మరణించడం లాంటి సంఘటనలు చోటుచేసుకోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాల్ ఓరమ్, హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు కూడా ఉన్నారు. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్తోను, డీజీపీ, ఇతర భద్రతాదళాల అధిపతులతోను రాజ్నాథ్ వెంటనే సమావేశమయ్యారు. గురువారం నాడు ఆయన అల్లర్ల ప్రభావిత ప్రాంతాలకు వెళ్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assam tension  bodo millitants  tribals  rajnath singh  

Other Articles