Sanjay dutt recieves new year gift in advance from jail officials

Actor Sanjay Dutt, Sanjay Dutt granted furlough, Sanjay Dutt flashes abs, sanjay dutt furluogh, sanjay dutt ouf of yerawada jail, sanjay dutt granted temporary leave, sanjay dutt at home, sanjay dutt arms act case, sanjaydutt convicted, sanjay dutt christmas holidays, sanjay dutt new year gift, jail officials new year gift to sanjay dutt,

Actor Sanjay Dutt, who is serving a jail sentence of a little less than 4 years after being convicted under the Arms Act in 2013, was granted furlough -- a temporary leave of absence -- by the Yerwada jail in Pune on Tuesday where he is lodged.

నూతన సంవత్సర వేళ సంజయ్ దత్ కు జైలు అధికారుల కానుక

Posted: 12/24/2014 08:53 PM IST
Sanjay dutt recieves new year gift in advance from jail officials

పుణెలోని యరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు జైలు నుంచి 14 రోజుల తాత్కాలిక సెలవు లభించింది. దాంతో ఆయన జైలు నుంచి ఇంటికి వెళ్లినట్లు యరవాడ జైలు అధికారులు బుధవారం వెల్లడించారు. జైలు జీవితం నుంచి తనకు తాత్కాలిక ఉపశమనం కావాలని సంజయ్ దత్ పెట్టుకున్న ఆర్జీని యర్రవాడ జైలు అధికారులు పరిశీలించి.. ఎట్టకేలకు అనుమతిని మంజూరు చేశారు. దీంతో ఆయన నేరుగా స్వగృహానికి వెళ్లారు. జైలులో తాను చేస్తున్న వ్యాయామంతో కండలను పెంచారు దత్.

జైలు నుంచి ఇంటికి వెళ్లగానే ఆయన తన కండలను, సిక్స్ ప్యాక్ ను తన బంధువులు, మీడియా ఎదుట ప్రధర్శించారు. జైలై జీవితంలోనూ తాను శారీరికంగా దృడంగా వున్నానని చెబుతున్నారు. అయితే సంజయ్ దత్ ఇప్పటికే మూడు పర్యాయాలు పేరోల్ పై బయటకు వచ్చారు. కాగా ఇప్పుడు తాత్కాలిక సెలవు పేరతో మరో పక్షం రోజులు అతనికి సెలవు లభించడం కూడా చర్చనీయాంశంగా మారింది. సాధరణ ఖదీలకు సంజయ్ దత్ కు మధ్య జైలు అధికారులు వత్యాసాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ముంబై బాంబు పేలుళ్ల కేసులో గతేడాది సంజయ్ దత్కు ఐదేళ్ల శిక్ష పడిన సంగతి తెలిసిందే. సంజయ్ ఇప్పటికి 18 నెలల జైలు శిక్ష పూర్తి చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjay dutt  furlough  yerawada jail  Bollywood  

Other Articles