K balachander indian film director dies at 84 special story on bala chandar

k bala chandar died, k bala chandar age, k bala chandar total movies, k bala chandar recent movies, k bala chandar with rajanikanth, k bala chandar with kamal hasan, k bala chandar special story, k bala chandar bio graphy, k bala chandar life history

Veteran Tamil film director K Balachander, who was the mentor of superstar Rajinikanth and actor Kamal Haasan

ప్రత్యేక కథనం: సినీ రంగులకు, సామాజిక రంగులను అద్దిన అపురూప దర్శకుడు

Posted: 12/24/2014 02:39 AM IST
K balachander indian film director dies at 84 special story on bala chandar

భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక అంకం ముగిసింది. చిత్ర పరిశ్రమకు పితామహుని లాంటి వ్యక్తి, దేశానికే గర్వకారణమైన చిత్రాలు తీసిన వ్యక్తి ఇక సెలవంటూ వెళ్ళిపోయారు. నిజంగా బాలచందర్ మన దేశం గర్వించే ఒక గొప్ప దర్శకుడు., దక్షిణ భారతదేశంలో ఏ భాషను తీసుకున్న, ఏ ప్రాంతాన్ని తీసుకున్న కాని, ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడాయన. కళామతల్లి "తను" లేని కళను ఎలా చూస్తుందో తెలియదు కాని భారత సినీ రంగం మొత్తం తల్లడిల్లే రోజు ఈ రోజు. దక్షిణ భారత సినీ చరిత్రను తీసుకుంటే అది 'ఈ మహా వ్యక్తి' తో మొదలు పెట్టి మళ్ళి 'ఈ మహా వ్యక్తి' తర్వాత అని చెప్పాల్సి వస్తుందంటే నిజంగా ఆశ్చర్య పడక్కర్లేదు. ఇప్పుడున్న 'అగ్ర నటులకు' ఆయనే నటనలో ఓనమాలు దిద్దించింది. ఆయనను ఓ కళలో భాగంగా మనం చూడలేమేమో..! ఎందుకంటే ఆయనే కళకు.., కళ అంటే ఇదనీ నేర్పించిన సృష్టికర్త అంటే అతిశయోక్తి కాదేమో...!!

"నేను ప్రపంచంతో పోట్లాడటం లేదు ప్రపంచమే నాతో పోట్లాడుతుంది.." గౌతమ బుద్దుడు అన్న మాటలు గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. బాలచందర్ జీవితాన్ని తీసుకుంటే ఈ మాటలు నిజమేమో అనిపిస్తాయి. అందరికి ఆయన ఆలోచనలే, ఆయన జ్ఞాపకాలే.., నిజమే ఆయనేప్పుడు ఎదుటివారితో పోరాడలేదు, పోటి పడనూ లేదు. ఆయనకు పోటీ సాటి మరెవరునూ లేరు. ఆయన ఆలోచనలకు ఆయన ఆలోచనలే పోటి.. అసలు ఆయనకు ఆయనే పోటేమో. ఆయన నిత్య సంఘర్శకుడు. ఆయన ప్రపంచానికి నేనిది అని ఎప్పుడూ చెప్పలేదు.. ఆయనకు ఆయన ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోనూలేదు.. ఎందుకంటే ఆయన చిత్రాలే ఆయన ఇది అని ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆయన ప్రపంచానికి సమాధానం చెప్పాలని అనుకున్నప్పుడు కూడా ప్రత్యక్షంగా ఎప్పుడు సమాధానం చెప్పలేదు. తన చిత్రం ద్వారా ఈ ప్రపంచానికి తన జవాబు ఇచ్చాడు. ఒక్కో చిత్రం ఒక్కో సంఘర్షణ. ఒక్కో చిత్రం ఒక్కో సామాజిక బాధ్యత. ఆయన సినిమా తీయాలి అని సినిమా తీయలేదు. 'సినిమాలో ఈ సమాజాన్ని తీయాలని' సినిమా తీసాడు.

ఏ హాలీవుడ్ అని తీసుకున్న,ఏ వుడ్ అని తీసుకున్న., అంతర్జాతీయ ప్రేక్షకులైన, అంతరిక్ష ప్రేక్షకులైన.., ఎవరైనా సరే వారికి ఏ స్టీవెన్ స్పీల్ బర్గో, ఇంకెవరన్నా గొప్పవారు కావచ్చు కాని భారత ప్రేక్షకుల ప్రేమించే మనసులకు మాత్రం బాల చందరే గొప్ప అని గర్వంగా చెప్తారు.., చెప్పగలరు కూడా.. ఎందుకంటే ఏ అనుభవం ఉన్న దర్శకుడైన, ఏ ఆపార జ్ఞానం ఉన్న దర్శకుడైన ఎవరైనా సరే లేని కథను ఉన్నట్లుగా సృష్టించి చిత్రంగా మలచి మన ముందుకు తీసుకురాగలరు కావచ్చు.., కాని బాల చందర్ మాత్రం ఉన్నది ఉన్నట్లుగా.., కళ్ళకు కట్టినట్లుగా చూపించటమే ఆయన ప్రత్యేకత. అవును మరీ.. అదీ నిజమే కదా.. బాల చందర్ ఈ సమాజాన్ని చిత్రంగా మలిచాడు,, సమాజంలో ఉన్న సమస్యలను చిత్రంగా మలిచాడు.., అదీ ఆయన గొప్పతనం.. బాలచందర్ జీవిత గ్రంధాన్ని చదవాలి అంటే మనకు అందులో ఒక పుట చాలేమో.. ఆ పుట ఒక్కటి చాలు చిత్ర రంగం విజయ గర్వంతో పూనీతం కావటానికి... అన్నం ఉడికింది తెలియాలి అంటే ఒక్క మెతుకు పట్ట్టుకుంటే చాలు మనకు తెలిసిపోతుంది అంటారు. మనకు తన జీవితం గురించి తెలుసుకోవాలన్న, ఒక్కసారి ఆయన ప్రతిభా పాటవాల్ని వినాలన్న ఆయన సినిమా ఒక్కటి చాలు. ఒక్కటంటే ఒక్కటి చాలు... ఆయనేంటో మనకు తెలుస్తుంది.

అది భారత దేశం తీవ్ర నిరుద్యోగంతో అల్లాడుతున్న సమయం.. దేశమంతా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఏ పల్లె వెళ్ళినా కరవు కాటకాలు. పల్లెల్లోనే అలా ఉంటె నగరాల్లో భయంకరమైన దారిద్ర్యం. అప్పుడు తీసుకొచ్చాడు మన 'సామాజిక సినీ కెరటం' బాల చందర్... నిరుద్యోగ భారత దేశాన్ని కళ్ళకు కట్టేలా చూపించిన చిత్రమది.. "ఆకలి రాజ్యం". అందులోని పాత్రది అన్యాయానికి ఎదురొడ్డి నిలిచే విప్లవ కవి అంతరంగం అది... కుల వివక్ష అనే కుళ్ళు ను కడిగి పారేసే ఒక యువకుణి అంతరంగం అది... స్వయం కృషి తో బతకాలనే తపన ఉన్న తరుణిడి అంతరంగం అది.... సమాజానికి ఉపయోగపడాలానే కసి కలిగిన సామాజిక బాధ్యత కలిగిన నవ యువకుడి నిజమైన అంతరంగం అది... అందులో సినిమాను చూపించలేదు... సమాజాన్ని చూపించాడు, మన నిరుద్యోగ భారతాన్ని బంధించాడు. నటులను చూపించలేదు.., నిరుద్యోగం తో సతమవుతున్న నవతరాన్ని చూపించాడు. కాలే కడుపులతో, భగ భగ మండే మనసులతో, మల మల మాడే పనికి రాని మేధస్సుతో, బరువెక్కుతున్న బాధలతో, నిప్పుకణికల్లాంటి నిరుద్యోగ యువతరాన్ని నిజంగా ఈ నింగికి చూపించాడు, 'నేలకూ' చూపించాడు నేటి తరన్నాయిన దారిలో పెడతారని... దేశ రాజధాని నడి బొడ్డున ఆనాటి నవ యవ్వన యువ భారతాన్ని సృష్టించాడు. అదొక సినిమా కాదు చూసి తరించటానికీ, అదొక పాఠం కాదు విని మర్చిపోవటానికీ.. అదొక సందేశం కాదు పుస్తకాల్లో రాసి పెట్టుకొని చూసుకోవటానికీ...., అదొక 'నిజం'...అవును అదొక 'నిజమే'.. విని తట్టుకోగలగాలి. అది సమాజంలో జరుగుతున్న 'నిజం'.. అందుకే నిజాన్ని నిస్సంకోచంగా చూపించాడు. కేవలం చూపించలేదు చూస్తున్న ప్రేక్షకుల చేత కూడా 'నిజమని' అనిపించాడు. అందుకే ఆయన నిజమైన దర్శకుడు, కాదు కాదు నిజమైన గొప్ప దార్శనికుడు...

ఆయన తీసిన ఒక చిత్రంలో(రుద్ర వీణ) గుడి మీదుగా ఆ చిత్రం ప్రారంభమై.., ఒక చిన్నవాడు మడి కట్టుకొని మంత్రాలు జపిస్తూ ఉండటం వల్ల ఒక ముసాలావిడకు సహాయం చేయలేకపోతాడు. అప్పడు అక్కడ ఏ సందేశం వినిపించలేదు. ఒక చిన్న వ్యాఖ్యం మాత్రం మన మదిలో మర్చిపోలేని మంచి మాటగా నిలుస్తుంది. "మనకు రెండు చేతులు ఇచ్చింది ఒకటి నీ కోసం, ఇంకొకటి పక్క వాడి చేయూత కోసం..." అవును మరి ఆయన తన చిత్రం లో ఎప్పుడు 'పక్కా వ్యాపారం' చూడలేదు ఎప్ప్పుడూ 'పక్కవాడి' గురించే చూపించాడు.., పక్కవాడికి ఎలా చేయూతనందించాలో చూపించాడు..., అప్పుడు అక్కడ ఆ క్షణం ఒక చరణం ప్రారంభం అవుతుంది... "చుట్టూ పక్కల చూడరా చిన్నవాడ... చుక్కల్లో నీ చూపు చిక్కుకున్నవాడ...." అవును మరీ ఆయన చిత్రం ద్వారా కేవలం "చిత్రాన్ని" చూపించలేదు.. చుట్టుపక్కల జరుగుతున్న వి"చిత్రాలను" చిత్రాలుగా మలిచి చూపించాడు.

రుద్రవీణ భారత దేశ యువకుల హృదయాలను తాకిన చిత్రమది.., భారతదేశ యువకుల అంతరంగమే ఆత్మ దీపమై ఆత్మ పరిశీలన చేసుకునేలా చేసే చిత్రమది.... "కులమా నీవెక్కడ అంటే కుల్చేస్తాను.... మతమా నీ జాడేక్కడ అంటే మండే జ్వాలగ్నినై మంటలో కలుపుతాను... మానవత్వమా.. అయితే నేనిక్కడ అనే యువకుల హృదయాంతరాల్లో చెరగని ముద్ర వేసుకున్న చిత్రమది...," భారత యువకులను "తామేంటి" అని ఆలోచింపజేసేలా చేసిన చిత్రమది... ఉడుకు రక్తం ఎగసి పడే యువకులను.., నువ్వు మందు కొట్టి తాగి పడేసే సీసాలో నీ రక్తాన్ని ఎగసి పడనివ్వకు.., నువ్వు గమ్ము గా తాగే దమ్ము పీలుస్తున్న పొగ లో నీ రక్తం వృధా కానివ్వకు.. నీ రక్తం ఉవ్వెత్తున ఎగసి పడాల్సింది భారత దేశ పల్లెల్లో.., వారి ఇళ్ళల్లో.., ఇళ్ళ గడపల్లో... అని, నేటి యువకుని చెంప చెల్ల్లుమనిపించేలా చేసిన చిత్రమది.... ఆవేశం ఎగసి పడాల్సింది, ఎక్కడో కాదు.., పేదరికాన్ని శాశ్వతంగా తమ ఇంట్లో ఉంచి ఆ పేదరికం తోనే పెరిగి, తమ తదుపరి తరాన్ని మళ్ళి ఆ పేదరికం తోనే పెంచుతున్న కడు పేదలను పేదరికం అనుభవించేలా చేస్తున్న ఆ "పేదరికం గుండెల్లో" నీ ఆవేశం ఎగసిపడాలి అని నవతరం నరనరాలు ఉప్పొంగి ఉత్తేజపూరితమయ్యేలా చేసిన చిత్రమది....

ఈ రెండు మెతుకులు చాలదా ఆయనేంటో అర్దమవటానికి..., ఈ రెండు ఆణిముత్యాలు చాలదా ఆయన బ్రతుకు అనే బంగారు"చంద"నంలోని జీవిత సుగంధపు పరిమళాలు ఆస్వాదించటానికి.., ఇంకా ఏమని వర్ణించేది ఆయన గురించి.. ఒకటా రెండా ఎన్నో ఆణిముత్యాలు.., సినీ వినీలాకాశంలో ధృవ తారల్ల వెలిగే సుదరమైన చిత్రాలు... ఆయన గురించి మనం మాట్లాడుకునే ఈ నాలుగు మాటలు సరిపోతాయా.... ఆయన ఆలోచన ఆకాశం, ఆయన బాట అనుసరణీయం, ఆయన పలుకులు అద్భుతం, ఆయన భావాలు ఆశ్చర్యం, ఆయన చేతలు ఆదర్శం, ఆయన చిత్రాలు అపూర్వం... లెక్క లేనన్ని అవార్డు లు అందుకున్న ఆయనకి భారతదేశ కళారంగం ఏమిచ్చి అతని రుణం తీర్చుకోగలదు. అతని కళా హృదయాన్ని అందరి మనస్సులో నిక్షిప్తం చేయటం తప్ప... ఒక మహా కవి అన్న మాటలు మదిలో స్పూరణకు వచ్చాయి... మనం మనంగా ఈ లోకానికి కనిపించాలి.., మన మాటలు మనంగా ఈ లోకానికి ప్రతిద్వనింపజేయాలి..... అవును మరీ బాల చందర్ "అతడు అతనిగానే ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు... అతడు అతడిగానే ఈ లోకానికి కనిపించాడు.. అతడు అతడు గానే ఈ లోకం నుండి వీడ్కోలు తీసుకున్నాడు... దక్షిణ భారత దేశ సినీ ప్రపంచానికి తన జీవితమనే అధ్యాయాన్ని అంకితమిచ్చిన గొప్ప దర్శకుడికి మా తెలుగు విశేష్ బాధాతప్త హృదయంతో.... అశ్రు నివాళి!!


హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : k bala chandar  film director  died  special story  

Other Articles