Congress open to alliance with any secular forces

Congress alliance with PDP, Congress PDP alliance in JK, congress pdp form government, congress pdp form government in JK, voters throw hung verdict, voters throw hung verdict in JK, congress secular stand, pdp decision pending, pdp not yet decided, Assembly Elections, Alliance, Ghulam Nabi Azad, Government, Secular Force, Communal Force, BJP,

With assembly elections in Jammu and Kashmir throwing up a hung verdict, Congress leader Ghulam Nabi Azad on Tuesday said it was 'open' to aligning with PDP in the state to provide a government.

ప్రభుత్వాన్ని ఏర్పాటుకు లౌకికవాదులతో జతకడతాం

Posted: 12/23/2014 08:25 PM IST
Congress open to alliance with any secular forces


గత ఏడాది నుంచి వరుస పరాజయాలను చవిచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్రను పోషించే స్థాయికి చేరుకుంది. తాజాగా జరిగిన జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలలో జార్ఖండ్ లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ కాశ్మీర్ లో మాత్రం 12 స్థానాలతో నాల్గవ స్థానంలో కోనసాగింది. అయితే పిడీపి పార్టీ అత్యధికంగా 28 స్థానాలను సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపి 25 స్థానాలతో రెండో స్థానంలో కొనసాగింది. 15 స్థానాలతో నేషనల్ కాన్ఫరెన్స్, 12 స్థానాలతో కాంగ్రెస్ తరువాత స్థానాలను అక్రమించాయి. అయితే మొత్తం 87 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి లభించకపోవడంతో.. ఇతర పార్టీల మద్దతు తప్పని సరైంది.

ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాము పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమని కాంగ్రెస్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పీడీపీకి వస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. గతంలో పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్ తో జట్టు కట్టిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్ లో మతచాంధాస పార్టీలను పక్కన బెట్టేందుకు ఏదేని లైకిక పార్టీలతోననా తాము జత కట్టేందుకు సిద్దమని వెల్లడించారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కలవబోమని స్పష్టం చేశారు. పీడీపీ కోసం తమ పార్టీ తలుపులు తెరిచివున్నాయని చెప్పారు. ప్రస్తుతం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి వుందని, కాశ్మీర్ లో మతవాదులను అడ్డుకునేందుకు తమతో జతకట్టేందుకు పిడీపీ సిద్దమో లేదో తేల్చుకోవాల్సిని ఆయన సూచించారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir  assembly elections  alliance  secular stand  gulam nabi azad  

Other Articles