Failed thief writes touching letter to bank

Failed thief writes letter, Failed thief writes letter to bank, Failed thief writes touching letter, ailed thief writes touching letter to bank, thief failed to rob Canara Bank, thief failed to rob Nodia Canara Bank, poor, desperate apologetic Thief, detective work is on for thief, thief in nodia canara bank, thief writes apology letter,

The thief who failed to rob a Canara Bank branch in Noida Sunday night is poor, desperate and apologetic. The clues about the thief came not from detective work but a letter he left behind.

’కష్టాల్లో వున్నాను కాబట్టే దొంగతనానికి వచ్చాను’

Posted: 12/23/2014 05:03 PM IST
Failed thief writes touching letter to bank

‘నేను మీ బ్యాంక్ లో దొంగతనానికి వచ్చాను. మీ కుర్చీలో కూర్చొనే ఈ లెటర్ రాస్తున్నాను. నేను స్వతహాగా దొంగను కాను, పీకల్లోతు కష్టాల్లో వుండి మాత్రమే తాను దొంగతనానికి సాహసించాను. నాకు ఎదిగిన పిల్లలు వున్నారు. అధిక ధరలు, పెరుగుతున్న ధరాఘాతం నన్ను తీవ్రంగా బాధిస్తుంది. దీనికి తోడు నాకున్న ఓ చిన్న ఉద్యోగం కూడా ఇటీవల పోయింది. అందుకనే నేను మీ బ్యాంకుకు కన్నం వేయడానికి వచ్చాను’ అంటూ ఓ దొంగ తన అవేదనను వెలిబుచ్చాడు. మీ బ్యాంకుకు కన్నం వెయడానికి వచ్చనందుకు నన్న మన్నించండీ అంటూ తన లేఖలో బ్యాంకు అధికారులను కోరాడు. అదీనూ బ్యాంక్ లెటర్ ప్యాడ్ తీసుకుని దానిపై తన మనోవేదనను వెలిబుచ్చుతూ లేఖ రాశాడు.

ఈ చిత్రమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీకి చేరువలో వున్న నోడియా పట్టణంలోని సెక్టార్ 6లో వున్న కెనరా బ్యాంకు బ్రాంచ్ లో చోటుచేసుకుంది. సోమవారం బ్యాంకు సమయానికి చేరుకున్న అధికారులు తలుపులు తెరచి వుండటం చూసి పోలీసులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్వేషించగా, బ్యాంకు అధికారులకు దొంగ రాసిన లేఖ లభించింది. పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది. దొంగ ఆచూకీ కోసం సిసి టీవీ కెమెరాలను కూడా అన్వేషించామని, అతను అందులో ఏమైనా చిక్కాడేమోనని వెతికామని పోలీసులు చెప్పారు.

కాగా దొంగ బ్యాంకుకు కన్నెం వేసేందుకు వచ్చాడే కానీ.. అది చేయడంలో తాను విపలమయ్యాడని పోలీసులు నిర్థారించారు. దొంగ రాసిని లేఖ నిజమే అయ్యే అవకాశాలు వున్నాయని, పోలీసులు బావిస్తున్నారు. కంప్యూటర్లు, డాక్యూమెంట్లు, స్ట్రాంగ్ రూమ్ సహా లాకర్లు అన్ని పథిలంగానే వున్నాయని చెప్పారు. ప్రధాన ద్వారం వద్ద పైకప్పును నుండి లోపలికి చొరబడ్డ దొంగ బయటకు వెళ్లే క్రమంలో కిటీకీని ధ్వంసం చేసి వెళ్లాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే లేఖ నిజమన సంబర్భంలో కొత్త వ్యక్తులు కూడా బ్యాంకులోపలకి సునాయసంగా చొరబడగలుగుతున్నారని, బ్యాంకు భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నోడియా పోలీసులు నిఘా వ్యవస్థ వైపల్యంపై కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Failed thief  Theft  touching letter  Canara Bank  Noida police  robbey  inflation  

Other Articles