No buyers for hate book on pawan kalyan

pavan fans in srikakulam, no buyers for hate book, no buyers for pawan hate book, book on pawan kalyan, writer srinivas, pawan kalyan fans protest, pawan kalyan fans rally, pawan kalyan srikakulam fans protest, pawan kalyan srikakulam fans rally,

pavan fans in srikakulam conducts rally and files a complaint in police station against writer srinivas

పవన్ కల్యాణ్ పై పిచ్చిరాతలను సహించం..

Posted: 12/21/2014 07:26 PM IST
No buyers for hate book on pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రాజకీయ దురుద్దేశంతోనే హైదరాబాద్‌కు చెందిన బొగ్గుల శ్రీనివాస్ అనే రచయిత కళ్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో అనే పుస్తకం రాశారని పవన్ అభిమాన సంఘ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.లక్ష్మణ్, చల్లా శివప్రసాద్ ధ్వజమెత్తారు. పవన్ కల్యాన్ వ్యక్తిత్వానికి భిన్నంగా రాసినందున ఆ పుస్తకాన్ని కొనేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావడంలేదని చెప్పారు. రచయిత శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జై పవన్ కల్యాణ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ వైఎస్సార్ కూడలి  నుంచి డీఎస్పీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ  రాష్ట్రంలోని అధికార పార్టీ మెప్పు కోసమే రచయిత ఇలాంటి దిగజారుడు రాతలు రాశారని విమర్శించారు. పవన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ రాసినందున అభిమానుల మనోభావాలు గాయపడ్డాయని పేర్కొన్నారు. అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని  పవన్ అప్పట్లో ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం రచయిత శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ భార్గవనాయుడుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అభిమాన సంఘ సభ్యులు గుజ్జల తేజ, నీలంశెట్టి రవి, పి.నవీన్, ప్రదీప్, మనోజ్, చైతన్య, విజయ్, అశోక్, కేవీ రమణ, సంపత్, కిరణ్, గుడ్ల సాయి, బిడ్డిక రంజిత్ పాల్గొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Hatao Politics Bachao  Pawan Kalyan  Srikakulam  

Other Articles