Ycp mla roja lashes out on ap government

YCP mla roja, roja lashes out on AP government, roja criticises Ap government, roja alleges Ap government, HudHud cyclone relief measures, YSR congress party mla Roja, Roja lashes ap government on cyclone relief measures, Roja Questions donations, roja questions public donations

YCP mla roja criticises Ap government in HudHud cyclone relief measures.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రోజా

Posted: 12/21/2014 07:16 PM IST
Ycp mla roja lashes out on ap government

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీపై నిప్పులు చెరిగారు. హుదూద్ తుఫాన్ విషయంలో టీడీపీ సర్కార్ తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుదూద్ బాధితులకు 25 కేజీల బియ్యం సరఫరా చేశాం అంటూ టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రేషన్ షాపులో కిలో రూపాయికే అందజేస్తున్నారని, అలాంటప్పుడు 25 కేజీల బియ్యం ధర ఎంత? అని ఆమె ప్రశ్నించారు. బియ్యం రేషన్ షాపుల్లోంచి సరఫరా చేయలేదా? అని ఆమె నిలదీశారు. తుఫాను సమయంలో ముఖ్యమంత్రి స్వయగా ప్రభావిత ప్రాంతంలో వారం రోజుల పాటు వున్నారని, పరిస్థితులన్నీ సమీక్షించారని గుండెలు బాదుకుంటున్న టీడీపీ నేతలు ఆయన బస్సులోకి ఎప్పుడైనా ఎక్కారా అని ప్రశ్నించారు. చంద్బరాబు ఉన్న బస్సు ఫైవ్ స్టార్ హోటల్ లోని రూం కంటే అద్భుతంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు ఏం చేశారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు.

విశాఖ ప్రజలు తుపాను బారినపడి పేదరికంలో మగ్గిపోతుంటే… వారి పేరిట డబ్బు దండుకున్న టీడీపీ నేతలు అనూహ్యంగా ధనికులుగా మారిపోయారని.. ఇదెలా సాధ్యమయ్యిందో ప్రజలందరికీ తెలుసునని విమర్శించారు. హుదూద్ తుపాను విలయానికి చలించిన వేలాది మంది దాతలు చేసిన దానాలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడికి చేరిందని ఆమె నిలదీశారు. విశాఖలో తుపాను ధాటికి కూలిన చెట్లను తొలగించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ఆమె అడిగారు.

విద్యుత్ స్థంబాల దగ్గర నుంచి వైర్లు, ఇతర పరికరాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇచ్చాయన్నారు. రేడియో సెట్లు ఒరిస్సా ఇచ్చింది. కార్మికులను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సమకూర్చాయన్నారు. చివరకు తీవ్ర తుపాను తాకిడిలతో అల్లలలాడే ఒడిశా కూడా చెత్త తొలగింపు, ఇత్యాదులలో సాయం చేసిందని అమె పేర్కొన్నారు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధితుల సానుభూతి పొందే ప్రయత్నం చేసిందే తప్ప.. నిజంగా తుపాను బాధితుల కోసం ఏం చేసిందని రోజా ప్రశ్నించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  ysrcp party  AP government  HudHud cyclone  

Other Articles