Acid attack on lecturer in guntur

Acid attack on lecturer, lecturer acid attack, guntur lecturer acid attack, nallapadu government lecturer acid attack, nallapadu lecturer acid attack, nallapadu lecturer Venkata Ramana acid attack, government lecturer Venkata Ramana acid attack, girl student splashed acid on lecturer, lecturer decieved student by love, lecturer decieved girl student by love

A girl student allegedly splashed acid on a lecturer at Government Polytechnic College, Nallapadu in Guntur on Saturday. The lecturer, M. Venkata Ramana, who suffered serious burn injuries on his eyes, face and neck, was admitted to the Government General Hospital

ప్రేమించి, పెళ్లిచేసుకుంటానన్న నయవంచకుడికి తగిన శాస్తి

Posted: 12/21/2014 02:40 PM IST
Acid attack on lecturer in guntur

తనను ప్రేమిస్తూ.. వివాహం చేసుకుంటానని నమ్మించిన మరోకరిని వివాహం చేసుకున్న ప్రియుడుపై ఓ యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మోసం చేసిన నయవంచకుడికి ఆ యువతి తగిన శాస్తి చేసింది. గుంటూరు నగర శివారులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనాన్ని రేపింది. నల్లపాడు ప్రభుత్వ మైనార్టీ కళాశాలలో గణిత అధ్యాపకునిగా పనిచేస్తున్న వెంకటరమణ గతంలో నర్సరావుపేటలోని పీఎన్‌సీ అండ్ కేఆర్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా విధులు నిర్వహించారు.

ఆ సమయంలో అదే కళాశాలలో చదువుతున్న సౌజన్య అనే యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. ఇరువురి కులాలు వేరైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ ఈ ఏడాది ఆగస్టు 15న తెనాలి వైకుంఠపురంలో అనూష అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆ విషయాన్ని అతను గోప్యంగా ఉంచి సౌజన్యతో ప్రేమ నాటకం కొనసాగించారు. విషయం బయటకు పొక్కడంతో సౌజన్య తీవ్ర ఆగ్రహానికి గురైంది. అతనిని ఏదోలా శిక్షించాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో యాసిడ్ కొనుగోలు చేసి ఒక జగ్గులో పోసుకొని అతను పనిచేస్తున్న నల్లపాడు కళాశాల వద్దకు వచ్చింది. మధ్యాహ్నం కావడంతో అతను భోజనం చేయడానికి ప్రధాన రహదారిపైకి వచ్చారు. అదే అదనుగా భావించిన ఆమె జగ్గులోని ఆమ్లాన్ని అతని ముఖంపై చల్లింది. అతను గట్టిగా అరవడంతో స్థానికులు అక్కడకు చేరుకొని 108కు సమాచారం అందించారు. ప్రస్తుతం అతను ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సపొందుతున్నారు. అతను చూపుకోల్పోయే ప్రమాదంలో ఉన్నట్లు వైద్యుల సమాచారం. దాడికి పాల్పడిన సౌజన్యను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Acid attack  lecturer  Guntur  

Other Articles