Indian student in california gets job in facebook

indian student in california, indian IIT-B student gets job, indian IIT-B student gets Rs. 2crore job, indian IIT-B student gets job in facebook, indian student gets social networking site job, vineel pratap gets Rs. 2 crore job, vineel pratap gets Rs. 2cr job, vineel pratap gets facebook job, telugu student vineel pratap gets Rs. 2 crore job,

An IIT-Bombay student has claimed to have received a job offer of Rs 2 crore from social networking site Facebook.

రూ. 2కోట్ల వేతనంతో తెలుగుకుర్రోడిని వరించిన ఫేస్ బుక్ జాబ్..

Posted: 12/21/2014 01:39 PM IST
Indian student in california gets job in facebook

భారతీయు యువతకు ఉజ్వల భవిష్యత్తు వుందని చెబుతున్న ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలు అక్షరాల నిజమయ్యాయి. మంచి నైపుణ్యం, తెలివితేటలు వున్న భారతీయ విద్యార్థులను బహుళ జాతి సంస్థలు ఎగిరేసుకపోతున్నాయి. ఇటీవల ఐఐటీ బాంబే, నాగ్పూర్, కాన్పూర్, ఢిల్లీ విద్యార్థులు తమ చివరి సంవత్సరం ముగియకుండానే తమ సత్తాను చాటి కోట్ల రూపాయల ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలను అందుకున్నారు. మరికొందరు ఉన్నత చదువులు, ఇంకొందరు మానసిక ప్రశాంతత కోసమని కోట్ల రూపాయల వేతనాన్ని కూడా వదులుకున్నారు. వీరితో తెలుగుతేజాలు కూడా వున్నారు.

 చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ఎస్వీటీఎం ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ కె.శ్రీనివాసరెడ్డి కుమారుడు కె.వినీల్ ప్రతాప్(21)కు ఫేస్‌బుక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది. వార్షిక వేతనం రూ.రెండు కోట్లు. ఐఐటీ ముంబైలో బి.టెక్ పూర్తిచేసిన వినీల్ ప్రతాప్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వినీల్ ఇప్పటికే గూగుల్, ఈ-బే సంస్థల్లో ఉద్యోగం సంపాదించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రాంగణ నియామకాల్లో తాజాగా ఫేస్‌బుక్‌కు ఎంపికైనట్లు పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IIT  IIT-Bombay  Facebook  california  

Other Articles