Why should i resign i have done nothing wrong asks indian ambassador devyani khobragade

Diplomat Devyani Khobragade, indian ambassador devyani khibragade, ministry of external affairs of india, devyani says not broken any service rules, MEA fires on devyani, MEA says devyani stripping duties, devyani says no to resign, Devyani says no Question of resingning, Devyani asks why should i resign

Diplomat Devyani Khobragade asks why should she resign for the post and has reacted to the action against her by the ministry of external affairs saying she has not broken any service rules in talking to the media. and there was no question of resigning from the post.

నేనెందుకు రాజీనామా చేయాలి.. దేవయాణి

Posted: 12/20/2014 06:28 PM IST
Why should i resign i have done nothing wrong asks indian ambassador devyani khobragade

భారత ధౌత్యాధికారిణి దేవయాణి కోబ్రాగదే మరో సారి వార్తల్లో నిలిచింది. అమెరికాలో పనిమనిషిని అనుమతి లేకుండా తీసుకెళ్లిన ఘటనపై అగ్రరాజ్యం పోలీసులు అమెను అరెస్టు చేసి వివస్త్రను చేసి తనిఖీలు చేశారన్న వార్తల నేపథ్యంలో యావత్ భారతం అగ్రరాజ్యం దాష్టికం పై కన్నెర చేసిన క్రమంలో వినిపించిన పేరు దేవయాణి కోబ్రాగాదె. అయితే అమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి అమె తన అధికార హోదాను, సర్వీసు రూల్స్ ను మరచి మీడియాతో పలు అంశాలపై చర్చించారనన్న నేపథ్యంలో భారత విదేశాంగ వ్యవహరాల శాఖ అమెను విధుల నుంచి తప్పించి.. నిరీక్షణలో వుంచింది.

అయితే తాను మాత్రం మీడియాతో మాట్లాడిన అంశాలపై ఎలాంటి సర్వీసు రూల్స్ ను ఉల్లంఘించలేదని దేవయాణి తెలిపింది. తాను మీడియాతో మాట్లాడిన ప్రతి అంశం సివిల్ సర్వీసు రూల్స్ 1964 సెక్షన్ 9కి లోబడినట్టు తెలిపింది. భారత విదేశాంగ వ్యవహరాల శాఖ దేవయాణిని విధుల నుంచి తప్పించి నిరీక్షణలో వుంచిన నేపథ్యంలో ఈ వ్యవహారాం బయటకు వచ్చింది. అమెరికాలో భారత డిఫ్యూటీ కౌన్సిల్ జనరల్ గా వున్న దేవయాణిని అమెరికాలో తన పనిమనిషికి తక్కువ వేతనం ఇవ్వడంతో పాటు పాస్ పోర్టులో తనకు ఇచ్చే వేతనాన్ని ఎక్కువగా చేసి చూపినందుకు గాను అమెను అమెరికాలోని న్యూయార్క్ పోలీసులు గత డిసెంబర్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ అంశం తీవ్ర సంచలనం రేపడంతో పాటు అప్పటి అమెరికా దౌత్యాధికారిణి నాన్సి పావెల్ రాజీనామాకు కూడా దారి తీసింది.

అప్పట్లో తనపై అమెరికా మోపిన కేసులన్నీ అక్రమంటూ భారత్ కు తిరిగివచ్చి, అక్కడి నుంచి ఐక్యరాజ్యసమితికి వెళ్లిన దేవయాణి.. ఈ కేసుకు సంబంధించి మీడియాతో చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారి ఇప్పుడు అమె పదవికే ఎసరు పెట్టేలా చేశాయి. తన ఇద్దరు పిల్లలకు అమెరికా పాస్ పోర్టులు వున్నాయని, వారు అక్కడే జన్మించారని, వారిని అమెరికా పౌరులుగానే చూడాలన్న విషయాన్ని దాయడం మొత్తానికే ఎసరు తెచ్చింది. అయితే అమెను భారత విదేశాంగ శాఖ ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన విషయాన్ని విదేశాంగ శాఖకు చెందిన అధికారులు అనధికారికంగా దృవీకరించారు. ప్రస్తుతం దేవయాణిపై పరిపాలనపరమైన విచారణను అదేశించినట్లు కూడా తెలిసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles