Ap assembly winter session postponed to tommorrow

ap assembly, assembly postpone, ap assembly chandra babu naidu, n chandra babu naidu, ys jagan mohan reddy, minister achhennaidu, andhrapradesh assembly

Andhra Pradesh Legislative Assembly today strongly condemned the ghastly massacre

హుధుద్ పరిహారంపై దద్ధరిల్లిన అసెంబ్లీ

Posted: 12/19/2014 03:22 PM IST
Ap assembly winter session postponed to tommorrow

అనేక ఆన్డులనలు, సభ్యుల తోపులాటల మధ్య ఏ.పి శాసన సభ, శాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసన సభలో హుదుద్ తుఫాన్ పై చర్చ జరిగినపుడు ప్రతిపక్ష సభ్యులు అనేక విమర్శలు చేస్తూ, దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి గారు వేరే జిల్లా పర్యటన లో ఉన్నందున ఇప్పుడు శాసన సభ కు హాజరు కాలేరని వివరణ ఐచ్చి, ఇలాంటి అత్యున్నత సభలో జగన్ లాంటి అనేక ఆరోపణలు ఉన్న ప్రతి పక్ష నేత ఉండటం మన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దాంతో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.

స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి మంత్రి అలా అనటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తూ సభను స్తంభింప జేశారు.  అంతకు ముందే హుదుద్ తుఫాన్ పై మంత్రి వివరణ ఇస్తూ తాము సహాయం చేయకపోతే మరింత ప్రాణ నష్టం జరిగేదని, తుఫాన్ సమయం లో చంద్ర బాబు 24 గంటలు తిండి నిద్ర, లేకుండా అక్కడే గడిపి సహాయ పనులు పర్యవేక్షించారని, ఆయన పనితీరుతోనే వైజాగ్ ను మళ్ళి యధా స్థితి కి తేగలిగామని చెప్పారు. దాంతో విపక్ష సభ్యులు విమర్శలను తార స్థాయికి పెంచారు. సభలో అంత గందరగోళంగా ఉండటంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap assembly  n chandra babu naidu  ys jagan mohan reddy  postpone  

Other Articles