Mumbai attacks mastermind lakhvi bailed in pakistan

The Pakistan government, mumbai blasts, mumbai attacks, mumbai 26/11 attacks, kasab pakistan, lakhvi

appeal against mumbai blasts 26/11 accused zaki ur rehman lakhvi bail, Mumbai attacks mastermind Lakhvi bailed in Pakistan

కరడుగట్టిన కర్కోటకుడికి పాక్ బెయిలు

Posted: 12/19/2014 11:07 AM IST
Mumbai attacks mastermind lakhvi bailed in pakistan

ఆ రోజు ఒక విలయతాండవం. మన దేశం ఉలిక్కి పడిన రోజు కలలో అయిన మర్చిపోలేని రోజు మన దేశ చరిత్రలో మల్లి ఆ రోజు పునారావృతము కాకూడదని కోరుకునే అతి దారుణమైన రోజు.. ఆ రోజే 26/11 ముంబై దాడులు. మన దేశ ప్రజల ప్రశాంత జీవితంలో కల్లోలం రేపిన కర్కశ రోజు..., ఆ రోజే. ముంబై దాడులు మన దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. ఎన్నో కుటుంబాల్లో ఆరని చిచ్చు మిగిల్చింది.

ఆ రోజు భారత్ లో 166 మందిని పొట్టన పెట్టుకున్న నరమేధంలో సూత్రదారి లష్కరే కమాండర్ లఖ్వి అతడు పాక్ లో ఉన్నాడని ఎన్నో సార్లు మన దేశం చెప్తూ వచ్చింది కానీ పాక్ మన మాటను పాతిన్చుకోలేదు ఎట్టకేలకు  కొన్ని రోజుల తర్వాత అతన్ని పాక్ లోనే పట్టుకుంది. ముంబై దాడుల ఏళ్ళ కొద్ది నత్తనడకన సాగుతున్న విచారణ.... ఎట్టకేలకు చివరి దశకు వస్తున్న తరుణం లో పాక్ న్యాయస్థానం అతనికి ఇప్పుడు బెయిలు మంజూరు చేసింది. ఈ పరిణామం భారత్ కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. మన భారత ప్రభుత్వం, రాజకీయ పక్షాలు మండి పడ్డాయి.  గట్టి జవాబిచ్చేందుకు కేంద్రం దౌత్య పరంగా సన్నాహాలు మొదలు పెట్టింది.

హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ ప్రభుత్వాన్ని తప్ప పట్టారు.  బలమైన ఆధారాలు లేవన్న పాక్ వ్యాఖ్యల్ని భారత్ తిప్పి కొట్టింది. ఆ దేశం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని. ఆ ఆధారాలతో పాటుగా కొన్ని ఆధారాలు తాము జత చేశామని విస్పష్టంగా తేల్చి చెప్పింది. ముంబై మారణకాండ కేసులో ఉగ్రవాద సంస్థ నేతకు పాకిస్తాన్ న్యాయస్థానం బెయిలు మంజూరు చేయటం ఉగ్రవాద చరయన్లను ప్రోత్సహించటమే అని గట్టిగా మందలించింది. మంచి తాలిబన్ చెడ్డ తాలిబన్ అంటూ ఉండదని పాక్ ప్రధాని వ్యాఖ్యానించిన మరునాడే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

లఖ్వి 2006 లో 166 మండి ఊచకోత ఘటన కు కారణమైన ముంబై ఉగ్రదాడుల్లో కీలక సూత్రదారి. నిషేదిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా లో పథకాల అమలుకు నేతృత్వం వహించాడు.  అప్పుడు ముంబై దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల్ల్లో 9 మందిని భారత భద్రత దళాలు హత మార్చాయి. ప్రాణాలతో పట్టుబడిన కసబ్ ను కోర్టు లో విచారించి ఉరిశిక్ష అమలు చేశారు. కాని ఆ దారుణమైన ఘటనకు కీలక సూత్రధారి అయిన లఖ్వి మాత్రం ఇప్పుడు పాక్ న్యాయస్థానంలో బెయిలు పొందటంతో భారత్ కోపాగ్ని కి గురవుతుంది. ఇప్పటికే తాజా పరిణామాలపై భారత రాజకీయ పక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి.  పాకిస్తాన్ ఈ పరిణామం పై స్పందిస్తూ మేము ఈ బెయిల్ పై "పై న్యాయస్థానానికి" అప్పీల్ కి వెళ్తామని, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పింది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lakhvi  pakistan government  pakistan court  bail  

Other Articles