Pranathy gangaraju is miss india america 2014

Pranathy Gangaraju Miss India America, Pranathy Miss India America 2014, Pranathy student in film acting and production, Pranathy crowned Miss India USA 2014, Miss India USA 2014, pranathy gangaraju, Indian pageant outside India

Telugu girl Pranathy Gangaraju was crowned Miss India USA 2014. Miss India USA is the oldest running Indian pageant outside India. 19 year old Pranathy is a student in film acting and production

మిస్ ఇండియా అమెరికాగా తెలుగమ్మాయి.. ప్రణతి గంగరాజు

Posted: 12/18/2014 11:48 PM IST
Pranathy gangaraju is miss india america 2014

జార్జియాలో నివాసం ఉంటున్న తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు ప్రతిష్ఠాత్మమైన మిస్ ఇండియా అమెరికా 2014 టైటిల్ గెలుచుకుంది. సినిమా నటన, నిర్మాణంలో కోర్సు చేస్తున్న 19 ఏళ్ల ప్రణతికి నృత్యం, పాటలు పాడటం, రాయడం, ఈత లాంటి హాబీలున్నాయి. న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఐఎఫ్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంతకుముందు ఈ టైటిల్ గెలుచుకున్న మోనికా గిల్.. ఈసారి విజేత ప్రణతికి కిరీటం అలంకరించింది. 2016 జూన్ నెలలో గోవాలో జరిగే కార్యక్రమంలో మరోసారి ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ పోటీలలో ఫ్లోరిడాకు చెందిన మోనికా షా (24), హవాయికి చెందిన ఏంజెలా నంద్ (27)లకు వరుసగా రెండు, మూడు స్థానాలు లభించాయి. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మొత్తం 21 మంది భారత సంతతి అమ్మాయిలు ఈ అందాల పోటీలో పాల్గొన్నారు. న్యూజెర్సీకి చెందిన రియా కౌర్కు మిస్ టీన్ ఇండియా అమెరికా టైటిల్ లభించింది. మిస్ ఇండియా అమెరికా పోటీలో పాల్గొనేవాళ్లు 17-27 ఏళ్ల మధ్యవారై ఉండాలి, పెళ్లి చేసుకుని ఉండకూడదు, తాము ప్రాతినిధ్యం వహించే దేశానికి చెందినవాళ్లై ఉండాలి.  ప్రధానంగా వీరికి నాలుగు అంశాల్లో పోటీ నిర్వహించారు. ఈవెనింగ్ గౌన్, ఇండియన్ డ్రస్, టాలెంట్, ప్రశ్న-జవాబులు అంశాలు అందరికన్నా ప్రఃణతి గంగరాజు ముందు వరుసలో నిలిచారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pranathy Gangaraju  Miss India USA  India  USA  

Other Articles