Eamcet exam to be held separately says ganta srinivasa rao

seperate eamcet exams for AP. ap students to fo eamcet exams seperately, inter exams, inter students, Eamcet Exams,

eamcet exam to be held separately says ganta srinivasa rao

మా దారి మాదే, తెలంగాణతో కలవమంటున్న గంటా..

Posted: 12/18/2014 11:39 PM IST
Eamcet exam to be held separately says ganta srinivasa rao

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు వున్న చిక్కుముడి విడిపోయేందుకు మార్గం సుగమం కానుంది. ఇంటర్ పరీక్షల నిర్వహణపై గత కొన్ని నెలలుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టు వీడకపోవడంతో.. ఆందోళనకు గురైన ఇరు రాష్ట్రాల ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంత ఉపశమనాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తుందని ప్రకటించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. యూనివర్శిటీల్లో ఖాళీగా వున్న పోస్టుల త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.  రిజర్వేషన్లకు అనుగుణంగానే పోస్టుల భర్తీ జరుగుతుందని ఆయన గురువారమిక్కడ స్పష్టం చేశారు. శాసనమండలిలో ఉద్యోగుల భర్తీపై  చర్చనంతరం... మంత్రి గంటా వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో  పలు ఉన్నత విద్యాక్షేత్రాల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ జరిగిందని చెప్పారు.

విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన 11 కేంద్ర సంస్థల్లో ఏడు విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. తిరుపతిలో ఐఐటీ, విశాఖలో ఐఎంఎం ఏర్పాటు అవుతున్నాయని, స్థల ఎంపిక ఖరారైనట్లు చెప్పారు. గన్నవరం ఎన్ఐటీలో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు జరుగుతాయని గంటా చెప్పారు. ఎంసెంట్ని ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తుందని, అయితే ఉమ్మడి ఎంసెట్ నిర్వహణకు తెలంగాణ రాష్ట్రం ససేమిరా అంటుందని ఆయన తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eamcet Exams  Andhrapradesh  Ganta Srinivasa Rao  

Other Articles